పనితనాన్ని పెంపొందించేందుకు డ్యూటీ మీట్‌లు : ఎస్పీ గౌస్ ఆలం

by Aamani |
పనితనాన్ని పెంపొందించేందుకు  డ్యూటీ మీట్‌లు : ఎస్పీ గౌస్ ఆలం
X

దిశ,ఆదిలాబాద్ : పోలీసు అధికారులు, సిబ్బంది పనితనాన్ని పెంపొందిందించాలనే పోలీస్ అధికారులకు, ఉద్యోగులకు, సిబ్బందికి జిల్లా, జోనల్, రాష్ట్ర, జాతీయ స్థాయి పోలీస్ డ్యూటీ మీట్ లను నిర్వహించడం జరుగుతుందని జిల్లా ఎస్పీ గౌష్ ఆలం తెలిపారు. బుధవారం స్థానిక పోలీసు హెడ్ క్వార్టర్స్ లో ఆదిలాబాద్ జిల్లా స్థాయి పోలీస్ డ్యూటీ మీట్ ను ఎస్పీ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు.ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ.. ఈ డ్యూటీ మీట్ లో ముఖ్యంగా నేర పరిశోధన, నేర స్థల పరిశోధన, వీఐపీ మూమెంట్, యాంటీ సబటిజ్ చెక్, డాగ్ స్క్వాడ్ యొక్క పనితనం, ఫింగర్ ప్రింట్ పై పరిశోధన, బాంబు డిస్పోజల్ టీం యొక్క విధులు, కంప్యూటర్ పై నైపుణ్యం, నేర స్థలంలో ఫోటోగ్రఫీ, అవాంఛనీయ సంఘటనలో సంభవించినప్పుడు వీడియోగ్రఫీ చేసే విధానం వంటి అంశాలలో రాత,మౌఖిక పరీక్షలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. రాష్ట్ర, జాతీయ స్థాయిలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన సిబ్బందికి జిల్లా స్థాయిలో రివార్డులను అందజేస్తామని తెలిపారు.ఈ పరీక్షలో కొన్ని అంశాలు ఇన్స్పెక్టర్ సబ్ ఇన్స్పెక్టర్ స్థాయి వారికి, మరికొన్ని అంశాలు ఏఎస్ఐ నుంచి కానిస్టేబుల్ వరకు ఉంటాయన్నారు.

జాతీయ స్థాయిలో మొదటి,ద్వితీయ, తృతీయ, బహుమతి పొందిన వారికి జాతీయ స్థాయిలో అత్యధిక నగదు బహుమతి ఉంటుందని తెలిపారు. ఇలాంటి డ్యూటీ మీట్ లలో పాల్గొన్నప్పుడు తమకు ఉన్న నైపుణ్యాలను అభివృద్ధి చేసుకోవచ్చని, ప్రస్తుత సమాజంలో నేరగాళ్లు ఉపయోగిస్తున్న నూతన పద్ధతులను తెలుసుకోవచ్చని, నూతన చట్టాలపై అవగాహన పెంపొందించుకోవచ్చని, ట్రైనింగ్ లో వాస్తవానికి ఉన్న భేదాలను గమనించవచ్చని సూచించారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ ఆపరేషన్ బి సురేందర్రావు, డీఎస్పీలు పోతారం శ్రీనివాస్, హబీబుల్లా, బి సురేందర్ రెడ్డి, రిజర్వ్ ఇన్స్పెక్టర్లు, సబ్ ఇన్స్పెక్టర్లు, తదితరులు పాల్గొన్నారు.

Next Story

Most Viewed