Alert : అత్యవసరమైతే తప్ప బయటికి రావద్దు

by Sridhar Babu |
Alert : అత్యవసరమైతే తప్ప బయటికి రావద్దు
X

దిశ, ఆదిలాబాద్ : రాష్ట్ర వాతావరణ శాఖ రెండు రోజుల పాటు ఆదిలాబాద్ జిల్లాకు భారీ వర్షాలు (రెడ్ అలర్ట్) సూచించిన దృష్ట్యా జిల్లా ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని ఆదిలాబాద్ జిల్లా ఎస్పీ గౌస్ ఆలం తెలిపారు. ఆపద సమయంలో ఎటువంటి ప్రమాదం తలెత్తకుండా జిల్లా పోలీసు యంత్రాంగం, అధికారులు ఎల్లవేళలా అప్రమత్తతతో విధులు నిర్వహిస్తారని ఆయన శనివారం పేర్కొన్నారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ ప్రత్యేక టెలి కాన్ఫరెన్స్ ఏర్పాటు చేసి జిల్లా పోలీసు అధికారులకు సూచనలు చేశారు. ప్రజలు అత్యవసర సమయాలలో తప్ప బయటకి రాకూడదని సూచించారు. ఎటువంటి సమస్యలు ఉన్నా అత్యవసర సమయంలో డయల్ 100 కు లేదా జిల్లా పోలీసు ముఖ్య కార్యాలయంలో కంట్రోల్ రూమ్

ఏర్పాటు చేసినట్లు తెలిపారు. 24 గంటలు అత్యవసర సమయంలో స్పందించేందుకు సిబ్బంది అందుబాటులో ఉంటారని, ప్రజలు 08732-226246, 8712659906 నంబర్ కు సంప్రదించాలని లేదా స్థానిక పోలీస్ స్టేషన్ కి సమాచారం అందించాలని సూచించారు. నూతనంగా శిక్షణ తీసుకున్న డీడీఆర్ఎఫ్ బృందం జిల్లాలో 24 గంటలు అందుబాటులో ఉంటుందని, ప్రాణ, ఆస్తి నష్టం, జరగకుండా కాపాడతారని అన్నారు. జిల్లా పోలీసు యంత్రాంగం అన్ని పోలీస్ స్టేషన్లలో అప్రమత్తతతో ఉంటుందని తెలియజేశారు. భారీ వర్షాలు పడి వరదలు సంభవించినప్పుడు కల్వట్లలో, బ్రిడ్జిలను, గమనిస్తూ ఉండాలని, బ్రిడ్జిలపై నుండి నీరు ప్రవహించే సమయాలలో ప్రజలు వాటిని దాటకుండా ఉండాలని సూచించారు. జలాశయాలు,

Alertచెరువులు, వాగుల వద్ద మత్స్యకారులు, ప్రజలు చేపల వేటకు వెళ్లకుండా ఉండాలని సూచించారు. వర్షం భారీగా ఉన్నప్పుడు పొలాలలో రైతులు విద్యుత్ మోటార్ల వద్ద జాగ్రత్తలు వహించాలని, విద్యుత్ స్తంభాలను కానీ, వైర్లను కానీ చేతులతో తాకకుండా ఉండాలని అన్నారు. చెట్ల కింద, పాడైన పాత భవనాల కింద, శిథిలావస్థలో ఉన్న భవనాల పక్కన ఉండకుండా చూడాలన్నారు. ముఖ్యంగా విద్యార్థులు, పిల్లలు పాత భవనాలలో ఉండకుండా చూడాలని తెలిపారు. ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న చెరువులు, కుంటలు, అలుగుల దగ్గర, ప్రధాన రహదారులపై ప్రవహించే వాగులు, వంకల దగ్గర నీటి ప్రవాహం స్థితిగతులపై ముందస్తు సమాచారం తెలుసుకొని ప్రత్యక్షంగా వెళ్లి పోలీస్ అధికారులు పర్యవేక్షించి తగు జాగ్రత్తలు తీసుకొని ప్రజల రాకపోకలను గమనించాలని సూచించారు.

Advertisement

Next Story

Most Viewed