సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన జిల్లా నేతలు..

by Sumithra |
సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన జిల్లా నేతలు..
X

దిశ, ఆదిలాబాద్ : తెలంగాణ రాష్ట్ర నూతన ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన ఎనుముల రేవంత్ రెడ్డిని మొదటి సారిగా ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, తలమడుగు జెడ్పీటీసీ గొక గణేష్ రెడ్డి కలిశారు. గురువారం హైదరాబాద్లోని ఎల్బీ స్టేడియంలో నిర్వహించిన ముఖ్యమంత్రి ప్రమాణస్వీకారం కార్యక్రమానికి వీరు హాజరు కాగా, కార్యక్రమం అనంతరం తెలంగాణ నూతన సీఎం జిల్లా వాసులను ఆప్యాయంగా పలకరించారన్నారు. ఇందులో జిల్లా నాయకులు భారత్ వాగ్మారే తదితరులు ఉన్నారు.

Advertisement

Next Story