అధికారులందరూ సమన్వయంతో పనిచేసి జిల్లా అభివృద్ధికి పాటుపడాలి : మంత్రి సీతక్క

by Aamani |   ( Updated:2024-06-12 15:29:07.0  )
అధికారులందరూ సమన్వయంతో పనిచేసి జిల్లా అభివృద్ధికి పాటుపడాలి : మంత్రి సీతక్క
X

దిశ, ఆసిఫాబాద్ : ప్రజాప్రతినిధులు, అధికారులు కలిసికట్టుగా పని చేసి జిల్లా అభివృద్ధికి పాటుపడాలని జిల్లా ఇన్చార్జి మంత్రి సీతక్క సూచించారు. కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా కలెక్టరేట్ లో జడ్పీ చైర్పర్సన్ క్రిష్ణారావు, ఎమ్మెల్సీ దండే విఠల్, ఆసిఫాబాద్ సిర్పూర్ ఎమ్మెల్యేలు కోవ లక్ష్మి, పాల్వాయి హరీశ్ బాబు, కలెక్టర్ వెంకటేష్ ధోత్రే, ఐటీడీఏ పీవో ఖుష్బూ గుప్తా, అదనపు కలెక్టర్లు దీపక్ తివారీ.,దాసరివేణు, డీఎఫ్ వో నీరజ్ కుమార్ లతో కలిసి జిల్లా అభివృద్ధి పై అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు. రానున్న వర్షాకాలం నేపథ్యంలో మూడు నెలలు జిల్లాలోని అధికారులు అప్రమత్తంగా ఉండి విధులు నిర్వహించాలని ఆదేశించారు. ముఖ్యంగా పంచాయతీరాజ్, ఆరోగ్య శాఖ అధికారులు నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ సీజనల్ వ్యాధులపై ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. గిరిజన గ్రామాలపై ఎక్కువగా దృష్టి సారించాలన్నారు.వైద్య శాఖలో ఖాళీ పోస్టులను తర్వలోనే భర్తీ చేస్తామని హామీ ఇచ్చారు.

మెడికల్ కళాశాలలో పొరుగు సేవల కోసం జిల్లా వాసులకే అవకాశం ఇస్తామన్నారు. గ్రామాల్లో పారిశుద్ధ్యం లోపించకుండా గ్రామ కార్యదర్శులు ముందుస్తు నివారణ చర్యలు తీసుకోవాలని సూచించారు. జిల్లాలో చేపట్టిన అమ్మ ఆదర్శ పాఠశాలల అభివృద్ధి పనులు నాణ్యతతో అన్ని సౌకర్యాలు కల్పిస్తూ సకాలంలో పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రైవేటుకు దీటుగా విద్యాబోధన అందిస్తూ పదిలో 100శాతం ఫలితాలు సాధించేలా కృషి చేయాలన్నారు. రైతులకు విత్తనాలు. ఎరువులు కొరత లేకుండా చూడాలని. అధిక ధరలకు విక్రయించే వారిపై పీడీ యాక్టు నమోదు చేయాలని ఆదేశించారు. అంతకుముందు ఆసిఫాబాద్ మండలంలోని మోతుగూడ,అప్పపెల్లి వాగు పై రూ.1.82 కోట్లతో నిర్మించనున్న వంతెన నిర్మాణానికి భూమి పూజ మంత్రి భూమి పూజ చేశారు. తర్వాత వాడి గూడ అమ్మ ఆదర్శ పాఠశాల కింద రూ.6.20 లక్షలతో నిర్మించిన అదనపు తరగతి గదులను ప్రారంభించారు. విద్యార్థులకు ఏకరూప దుస్తులు. పాఠ్య పుస్తకాలు అందజేశారు.

Advertisement

Next Story

Most Viewed