మెరుగైన వైద్య సేవలు అందించాలి.. జిల్లా కలెక్టర్ బొర్కడే హేమంత్ సహదేవరావు

by Sumithra |
మెరుగైన వైద్య సేవలు అందించాలి.. జిల్లా కలెక్టర్ బొర్కడే హేమంత్ సహదేవరావు
X

దిశ, తాండూర్ : ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే ప్రజలకు మెరువైన వైద్య సేవలు అందించాలని కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా కలెక్టర్ బొర్కడే హేమంత్ సహదేవరావు అన్నారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిని శుక్రవారం ఆయన తనిఖీ చేశారు. వార్డులు, రికార్డులు, ఆసుపత్రి పరిసరాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మట్లాడుతూ గర్భిణీలు ఆసుపత్రులలోనే ప్రసవాలు చేసుకునే విధంగా ప్రజలలో అవగాహన కల్పించాలన్నారు. ఫిబ్రవరిలో 28, మార్చిలో 21 ప్రసవాలు జరిగాయన్నారు. త్వరలో ప్రభుత్వ వైద్య కళాశాల ప్రారంభం అవుతున్నందున జిల్లా ఆసుపత్రిలో 330 పడకలు ఏర్పాటు చేసి వార్డుల వారీగా అవసరమైన ఏర్పాట్లు చేయడం జరుగుతుందన్నారు. డీఎంహెచ్ఓ కార్యాలయాన్ని తనిఖీ చేసి కార్యాలయ గోదాములలో నిల్వ ఉన్న మందులను రెండు రోజులలో పీహెచ్సీలకు తరలించాలని అధికారులను ఆదేశించారు. కలెక్టర్ వెంట ఆసుపత్రి పర్యవేక్షకులు స్వామి, వైద్య కళాశాల ప్రిన్సిపాల్ నాగార్జున చారి, అధికారులు ఉన్నారు.

పట్టాల పంపిణీకి సిద్ధంగా ఉండాలి...

జిల్లాలో అర్హులైన రైతులకు పోడు భూముల పట్టాల పంపిణీ చేసేందుకు అధికారులు సిద్ధంగా ఉండాలని జిల్లా కలెక్టర్ బొర్కడే హేమంత్ సహదేవరావు ఆదేశించారు. జిల్లా కేంద్రంలోని ఆర్డీఓ కార్యాలయంలోని పోడు దరఖాస్తులు, ఎస్డీఎల్సీ, డీఎల్సీ కమిటీ ఆమోదించిన పోడు పట్టాల రైతుల జాబితాను శుక్రవారం కలెక్టర్ పరిశీలించారు. ఈ కార్యక్రమంలో జిల్లా గిరిజన అభివృద్ధి అధికారి మణెమ్మ, ఆర్డిఓ. రాజేశ్వర్, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed