- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కలెక్టర్ సాక్షిగా... ప్రజాప్రతినిధుల స్థానంలో వారి కుటుంబ సభ్యులు..!
దిశ, బైంసా : గురువారం బైంసా పట్టణంలోని ఎంపీడీఓ కార్యాలయంలో క్రమబద్ధీకరించిన ఇండ్లస్థలాల పట్టాల పంపిణీ, కళ్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కుల పంపిణీ అధికారిక కార్యక్రమంలో భార్యల స్థానంతో భర్తలు, కుటుంబీకులు హజరయ్యారు. మహిళలకు అన్నిరంగాల్లో రాణించి, అవకాశాలు అందిపుచ్చుకునే ఉద్దేశంతో రాజ్యాంగబద్ధంగా అవకాశాలు కల్పించగా...ఆ పదవులు కేవలం నామమాత్రంగానే ఉంటున్నాయి.
ఈ కార్యక్రమంలో కలెక్టర్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ప్రజా ప్రతినిధులులైన కుబీర్ ఎంపీపీ తూము లక్ష్మీబాయి స్థానంలో కొడుకు తూము రాజేశ్వర్, కుబీర్ సర్పంచ్ మీరా స్థానంలో భర్త విజయ్ హాజరవ్వడం, జెడ్పీటీసీ అల్కాతాయి స్థానంలో మామ మాజి ప్రజాప్రతినిధి శంకర్ చౌహన్, భైంసా జెడ్పీటీసీ సోలంకి దీపా స్థానంలో తండ్రి భీమ్రావు హాజరవ్వడంతో పలువురు ప్రజలు ఇందుకేనా..! రాజ్యాంగం ప్రకారం మహిళలకు అవకాశాలిచ్చిన మళ్లీ వాళ్ళను పక్కనే పెడుతున్నారని గుసగుసలాడుకుంటున్నారు.