హైడ్రా తరహాలో కూల్చివేత

by Sridhar Babu |
హైడ్రా తరహాలో కూల్చివేత
X

దిశ, మంచిర్యాల : మంచిర్యాల జిల్లాలో అధికారులు హైడ్రా తరహాలో కూల్చివేతలు చేపట్టారు. దాంతో అక్రమ నిర్మాణదారులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. నస్పూర్ మున్సిపాలిటీ ప్రభుత్వ భూమి సర్వే నెంబర్ 42లో అక్రమంగా నిర్మించిన భవనాన్ని గురువారం కూల్చివేశారు. బీఆర్ఎస్ నేత డీకొండ అన్నయ్యకి చెందిన ఐదు ఫ్లోర్ల బిల్డింగు పోలీసు బందోబస్తు మధ్య మున్సిపల్, రెవెన్యూ శాఖ అధికారులు కూల్చివేశారు. ఇంటి యజమానిని ముందస్తు చర్యగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కూల్చివేతను అడ్డుకోవడానికి ప్రయత్నం చేసిన కుటుంబ సభ్యులను పోలీసులు స్టేషన్ కు తరలించారు.

నస్పూర్ మున్సిపాలిటీలోని 42 సర్వే నెంబర్ లో బీఆర్ఎస్ నేత డీకొండ అన్నయ్య అక్రమంగా ఐదంతస్తుల బిల్డింగ్ నిర్మించారని మున్సిపల్ అధికారులు తెలిపారు. భవన నిర్మాణానికి సర్వే నంబర్ 40లో అనుమతులు తీసుకుని సర్వే నంబర్ 42లో భవనం చేపట్టారని నస్పూర్ మున్సిపల్ కమిషనర్ సతీష్ పేర్కొన్నారు. 2022 నుంచి నోటీసులు ఇస్తున్నా డీకొండ అన్నయ్య పట్టించుకోలేదన్నారు. 15 రోజుల కిందట కూడా నోటీసులు జారీ చేసినప్పటికీ అన్నయ్య స్పందించలేదని పేర్కొన్నారు. దీంతో పోలీస్ అధికారుల సహాయంతో ఐదంతస్తుల భవనాన్ని కూల్చి వేశామని స్పష్టం చేశారు.

Advertisement

Next Story

Most Viewed