- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
హరితనిధి పేరిట ఫీజుల వసూలు సరికాదు : పాలిటెక్నిక్ స్టూడెంట్స్ జేఏసీ
దిశ, నిర్మల్ కల్చరల్ : హరితనిధి పేరిట పాలిటెక్నిక్ విద్యార్థుల నుండి ఫీజుల వసూలు చేయడం సమంజసం కాదని, ఈ వసూళ్లను కాలేజీలు మానుకోవాలని పాలిటెక్నిక్ విద్యార్థుల జేఏసీ రాష్ట్రచైర్మన్ మేకల అక్షయ్ కుమార్ అన్నారు. సోమవారం ఆయన పాలిటెక్నిక్ విద్యార్థులతో కలసి నిర్మల్ జిల్లా కేంద్రంలోని పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపాల్ అన్నపూర్ణను కలిసి వినతిపత్రం సమర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ హరిత నిధి పేరిట రూ. 100చొప్పున ఫీజు కట్టించుకోవడం మానుకోవాలని, కట్టించుకున్న ఫీజును విద్యార్థులకు తిరిగి చెల్లించాలని డిమాండ్ చేశారు.
రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలల విద్యార్థుల నుండి హరితనిధి పేరిట ఫీజు కట్టించుకుంటున్నారని, ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలల్లో ఇప్పటికే అడ్మిషన్ ఫీజు, కళాశాల డెవలప్ మెంట్ ఫీజుల పేరిట వసూళ్లు చేస్తున్నారన్నారు. ఇప్పుడు తాజాగా మరో కొత్తఫీజు కట్టించుకుంటున్నారని, ఇకనైనా హరితనిధి పేరిట ప్రభుత్వ పాలిటెక్నిక్ విధ్యార్థుల నుండి ఫీజులు కట్టించుకోవడం ఆపివేయాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్రమంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి చొరవ తీసుకుని ఈ సమస్యను వెంటనే పరిష్కరించాలని కోరారు.