- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బొగ్గు బ్లాకులను సింగరేణికే కేటాయించాలి
దిశ, మందమర్రి : సింగరేణి బొగ్గు బ్లాకులను సింగరేణికే కేటాయించాలని డిమాండ్ చేస్తూ సింగరేణి కార్మిక సంఘాల ఐక్యవేదిక మందమర్రి జీఎం కార్యాలయం ముందు ధర్నా నిర్వహించింది. మంగళవారం నిర్వహించిన ధర్నాకు హెచ్ఎంఎస్ నాయకులు రియాజ్ అహ్మద్, నారాయణ, ఏఐఎఫ్టీయూ నాయకులు జి.రాములు, ఎం.పోచమల్లు, టీఎస్యూఎస్ నాయకులు మిట్టపల్లి కుమారస్వామి, నీరటి రాజన్న, ఐఎఫ్టియూ నాయకులు కృష్ణ, జాఫర్, టీఎన్టీయూసీ నాయకులు బి.సంజయ్ కుమార్ లు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
అనంతరం వారు మాట్లాడుతూ బొగ్గు బ్లాక్ ల వేలానికి వ్యతిరేకంగా ఆరు కార్మిక సంఘాలు ఏకమై ఐక్యవేదికను ఏర్పాటు చేశామన్నారు. తెలంగాణలో ఉన్న బొగ్గు బ్లాకులను సింగరేణి సంస్థకే కేటాయించాలని 21 జూన్ నుండి ఉద్యమం మొదలైందన్నారు. 13 జూలై గోదావరిఖని నుండి మొదలైన ఆందోళనలు 25 జూలై నాటికి ముగుస్తాయని చెప్పారు. జూలై 30న చలో కొత్తగూడెం ప్రధాన కార్యాలయం ముట్టడి కార్యక్రమాన్ని
తలపెట్టినట్టు తెలిపారు. ఈ ఆందోళనలకు కార్మిక వర్గం వేలాదిగా తరలివచ్చి విజయవంతం చేయాలని కోరారు. సింగరేణి పరిశ్రమకు 139 సంవత్సరాల చరిత్ర అపార అనుభవం ఉన్న దృష్ట్యా నూతన బొగ్గు గనులను సింగరేణి సంస్థకే కేటాయించాలని డిమాండ్ చేశారు. అనంతరం కేంద్ర ప్రభుత్వ వ్యతిరేక విధానలపై నాయకులు పెద్ద పెట్టున విమర్శించారు. ఈ కార్యక్రమంలో నాయకులు జె.శ్రీనివాస్, వెల్ది సుదర్శన్, బోనాల శ్రీనివాస్, మణిరాంసింగ్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం ఏరియా జీఎం ఏ. మనోహర్ కు వినతిపత్రం అందజేశారు.