- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఉత్సాహంగా సాగిన భట్టి పాదయాత్ర..
దిశ, తాండూర్: సీఎల్పీ నేత భట్టి విక్రమార్క చేపట్టిన పీపుల్స్ మార్చ్ పాదయాత్ర ఆదివారం పదో రోజు ఉత్సాహంగా ముందుకు సాగింది. కుమురంభీం జిల్లా అసిఫాబాద్ మండలం బురుగూడ నుంచి మొదలై.. మోతుగూడ మీదుగా కైరిగం వరకు పాదయాత్ర కొనసాగింది. ప్రధాన సమస్యలను రైతులు, మహిళలు, విద్యార్థులు భట్టికి వివరించారు.
ఇందిరమ్మ రాజ్యం వస్తుంది..
2023 - 24 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలిచి తెలంగాణలో ఇందిరమ్మ రాజ్యం వస్తుందని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ధీమా వ్యక్తం చేశారు. మోతుగూడ వద్ద రాత్రి జరిగిన కార్నర్ మీటింగ్‌లో ఆయన మాట్లాడారు. రాష్ట్ర సంపాదనను బీఆర్ఎస్ ప్రభుత్వం దోచుకుంటున్నదన్నారు. బీఆర్ఎస్ దశాబ్ద పరిపాలనలో నీళ్లు, నిధులు, నియామకాల విషయంలో తెలంగాణ లక్ష్యాలు నెరవేరలేదన్నారు.
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఇంటి స్థలాలు, రేషన్ షాపుల్లో 9 రకాల సరుకులు ఇస్తామని, ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ చట్టం నిధులను దళిత గిరిజనుల అభివృద్ధికి ఖర్చు చేస్తామన్నారు. కౌలు రైతు, విద్యార్హులు, నిరుద్యోగ యువత ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలను అధికారంలోకి వచ్చిన వెంటనే పరిష్కరిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షుడు విశ్వప్రసాద్ నాయకులు గణేష్ రాథోడ్, మర్సుకోల సరస్వతి తదితరులు పాల్గొన్నారు.