ఎంబీ రికార్డ్స్ ను పోగొట్టుకున్న జూనియర్ అసిస్టెంట్..

by Sumithra |
ఎంబీ రికార్డ్స్ ను పోగొట్టుకున్న జూనియర్ అసిస్టెంట్..
X

దిశ, చింతలమానేపల్లి : రెవెన్యూ వ్యవస్థలో పనిచేస్తున్న గండ్ల రాజన్న తెలంగాణ ప్రభుత్వం రెవెన్యూ వ్యవస్థను రద్దుపరిచి ఆ తరువాత వివిధ శాఖలలో బదిలీ చేసిన విషయం తెలిసిందే. అయితే రాజన్నను జూనియర్ అసిస్టెంట్ గా చింతలమానేపల్లి మండల ప్రజాపరిషత్ లో బాధ్యతలు చేపట్టారు.

మనఊరు మనబడి కార్యక్రమంలో భాగంగా మంజూరైన కర్జెల్లి గ్రామం ప్రాథమికోన్నత పాఠశాల ప్రహారిగోడకు సంబంధించిన ఎంబీ రికార్డ్స్ ను ఈ నెల 17 శుక్రవారం ఐటీడీఏ ఉట్నూర్ కు అందజేసే క్రమంలో రాజన్న తాగిన మైకంలో పోగొట్టుకున్నారు. దీని విలువ 6లక్షల 93 వేల రూపాయలు ఉంటుంది. చింతలమానపల్లి మండల అభివృద్ధి అధికారి మహేందర్ జిల్లా ప్రజాపరిషత్ కార్యాలయానికి శుక్రవారం సరెండర్ చేశారు.

Advertisement

Next Story