థంబ్ అటెండెన్స్ కాదది..!అగ్గి పెట్ట అటెండెన్స్..!

by Sumithra |
థంబ్ అటెండెన్స్ కాదది..!అగ్గి పెట్ట అటెండెన్స్..!
X

దిశ, భైంసా : ఈ మధ్య అటెండెన్స్ రిజిస్టర్ స్థానంలో థంబ్ అటెండెన్స్ మిషన్స్ రావడం చూస్తున్నాం. ఎలక్ట్రానిక్ అటెండెన్స్ పనిలేకుండా పిల్లలు అగ్గిపెట్టలతో అటెండెన్స్ బోర్డును ఏర్పాటు చేశారు. ఓ ప్రైవేట్ పాఠశాల పిల్లలు తమ క్లాస్ రూమ్ బయట బోర్డు పై పిల్లలు అగ్గిపెట్టెల పై తమ తమ ఫోటోలు అతికించి, అగ్గి పెట్టెలను ఓపెన్ చేస్తే వచ్చే అట్టముక్క పై ఆబ్సెంట్ సింబల్ "ఏ" అని వుంచారు.

ఆ రోజు వచ్చిన పిల్లలు తాము ప్రెసెంట్ అని తెలియడానికి తమ పోటో వున్న తెలిచి వుంచిన అగ్గిపెట్టె అట్టముక్కను క్లోజ్ చేసి తరగదికి వెళ్తారు. ఇలా అగ్గిపెట్టెలతో అటెండెన్స్ బోర్డుని తయారు చేసుకున్న పిల్లల ఆలోచన చూసిన పలువురు ఇది కదా..!క్రియేటివిటీ అంటున్నారు. పిల్లలు ప్రతిరోజు ఉత్సాహంగా హాజరు అవ్వడానికి ఇష్టపడుతున్నారని పేరెంట్స్ చెబుతున్నారు.

Advertisement

Next Story

Most Viewed