- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
యాదగిరిగుట్టలో రియల్ ఎస్టేట్ కు పూర్వవైభవం తీసుకురావాలి
దిశ, యాదాద్రి భువనగిరి ప్రతినిధి : యాదగిరిగుట్టలో రియల్ ఎస్టేట్ రంగానికి తిరిగి పూర్వ వైభవం వచ్చే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని యాదగిరిగుట్ట పరిసర ప్రాంతాల రియల్ వ్యాపారులు, మధ్యవర్తులు కోరారు. బుధవారం యాదగిరిగుట్టలో రియల్ ఎస్టేట్ వ్యాపారులు, మధ్యవర్తుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ.. యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి దేవాలయం పున: ప్రతిష్ట తర్వాత ఏర్పడినటువంటి రియల్ ఎస్టేట్ కష్టాల గురించి చర్చించారు. యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి పున: ప్రతిష్ట ఆశించిన విధంగా జరగకపోవడంతో దాని తర్వాత రియల్ ఎస్టేట్ రంగం పూర్తిగా కుదేలైందన్నారు. వ్యాపారులు, మద్యవర్తులు దాని మీద ఆధారపడిన కొన్ని వేల కుటుంబాలు రోడ్డున పడ్డాయని, ఎన్నో రంగాలు దివాలా తీసాయని ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే వైటిడిఏ పర్మిషన్ విషయంలో ఉన్నటువంటి ఆంక్షలు పూర్తిగా తొలగించాలని, డీటీసీపీలో ఉన్నటువంటి నియమ నిబంధనలను అమలు పరచాలని కోరారు. ఒకప్పుడు ఉన్నటువంటి జీపీ లేఔట్లను పునరుద్ధరించాలని, యాదగిరిగుట్టలో ఆగిపోయినటువంటి అభివృద్ధి కార్యక్రమాలను తిరిగి ప్రారంభించాలని కోరారు. గతంలో వెంచర్లు చేసినప్పుడు మిగిలిపోయిన ప్లాట్లను రిజిస్ట్రేషన్ చేసుకునేలా వెసులుబాటు కల్పించాలని కోరారు.