తెలంగాణపై కేంద్రానిది స‌వ‌తి త‌ల్లి ప్రేమ‌: అటవీ శాఖ మంత్రి ఇంద్రక‌ర‌ణ్ రెడ్డి

by Shiva |
తెలంగాణపై కేంద్రానిది స‌వ‌తి త‌ల్లి ప్రేమ‌: అటవీ శాఖ మంత్రి ఇంద్రక‌ర‌ణ్ రెడ్డి
X

దిశ, ప్రతినిధి నిర్మల్: కేంద్ర ప్రభుత్వం తెలంగాణపై సవతి తల్లి ప్రేమ చూపుతోందని రాష్ట్ర అటవీశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి ఆరోపించారు. బుధవారం నిర్మల్ పుర‌పాల‌క సంఘ‌ స‌ర్వస‌భ్య అత్యవ‌స‌ర‌ స‌మావేశంలో మంత్రి ఇంద్రక‌ర‌ణ్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ... త్వరలోనే సీఎం కేసీఆర్ నిర్మల్ జిల్లా కేంద్రానికి రానున్నార‌న ఆయన తెలిపారు.

నిర్మల్ మున్సిపాలిటీ అభివృద్ధికి రూ.100 కోట్లు నిధులు కేటాయించాల‌ని సీఎంకు విన్నవిస్తామ‌ని తెలిపారు. ప్రతి వార్డుకు నిధులు కేటాయించి అభివృద్ధి చేస్తామ‌న్నారు. కేంద్రంలోని బీజేపీ మాత్రం వివిధ రాష్ట్రాల్లో ప్రభుత్వాల‌ను కూల‌గొడుతూ ముఖ్యమంత్రుల‌ను మారూస్తోంద‌ని మ‌హారాష్ట్రలో జ‌రుగుతున్న ప‌రిణామాలను ప్రస్తావించారు. తెలంగాణ‌పై కేంద్రం స‌వ‌తి త‌ల్లి ప్రేమ చూపిస్తుంద‌ని అన్నారు.

బీజేపీ పాలిత రాష్ట్రాల‌కు పెద్ద మొత్తంలో నిధులు కేటాయిస్తూ... తెలంగాణ‌కు మాత్రం ఒక్క రూపాయి కూడా ఇవ్వడం లేద‌ని బీజేపీ కేంద్ర ప్రభుత్వ తీరును త‌ప్పుప‌ట్టారు. రాష్ట్ర నిధుల‌తో అభివృద్ధి, సంక్షేమ ప‌థ‌కాల‌ను ప్రవేశ‌పెట్టి అమ‌లు చేస్తున్నామ‌ని స్పష్టం చేశారు. కేంద్ర క‌క్ష్య సాధింపు ధోర‌ణిని ప్రజ‌లంతా గ‌మనిస్తున్నార‌ని వెల్లడించారు. పార్టీలు శాశ్వతం కాద‌ని, ప్రజ‌లే అంతిమ నిర్ణేత‌ల‌ని వ్యాఖ్యనించారు.

వ‌చ్చే ఎన్నిక‌ల్లో రాజ‌కీయ ల‌బ్ధి కోసం చించోలి-బి స‌మీపంలోని వొకేష‌నల్ సెంట‌ర్ ఏర్పాటుపై బీజేపీ నేత‌లు నానా రాద్దాంతం చేస్తున్నార‌ని తెలిపారు. ఈద్గాతో పాటు అక్కడ వొకేష‌న్ సెంట‌ర్ ఏర్పాటు చేస్తామ‌ని ఆయ‌న అన్నారు. గ‌తంలో ఆల‌యాల నిర్మాణ‌ల‌కు కూడా స్థలాన్ని కేటాయించామ‌ని ఈ సంద‌ర్భంగా తెలిపారు. సమావేశంలో చైర్మన్ ఈశ్వర్ కౌన్సిలర్లు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed