- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
విరిగిపడిన ఆటమ్ ఎలక్ట్రికల్ బైక్.. అవాక్కైన జనం
X
దిశ, మంచిర్యాల టౌన్ : ఈ మధ్య ఎలక్ట్రిక్ వాహనాలు బ్యాటరీ సమస్య వల్ల కాలి బుడిదవుతున్న సంఘటనలు మనం చూస్తూనే ఉన్నాం. కానీ, ఏకంగా ఓ ఎలక్ట్రిక్ బైక్ నడిరోడ్డు మీదే విరిగిపడిన ఘటన మంగళవారం మంచిర్యాల పట్టణంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. శ్రీరాంపూర్ కు చెందిన శ్రావణ్ సంవత్సరం క్రితం ఎలక్ట్రిక్ రంగం నుంచి వచ్చిన ఆటమ్- ఈ (Atumobile Atum 1.0 Electric) బైక్ ను రూ.65వేలకు కొనుగోలు చేశాడు.
అయితే, మంగళవారం ఉదయం కూరగాయలు కొనేందుకు శ్రావణ్ ఆ బైక్ పై మంచిర్యాల మార్కెట్ కు వెళ్తున్నాడు. ఈ క్రమంలోనే ఒక్కసారిగా బండి హ్యాండిల్ ముందు భాగంలో ఉండే ఫార్క్ నడిరోడ్డపై విరిగిపోవడంతో బైక్ కుప్పకూలి పోయింది. దీంతో గాయాల పాలైన శ్రావణ్ ను చుట్టూ పక్కల వాళ్లు ఓ పక్కన కూర్చోబెట్టి బైక్ విరిగిపోవడం ఏంటని చర్చించుకున్నారు.
Advertisement
Next Story