బీజేపీ నాయకులను దూషిస్తే సహించేది లేదు..

by Sumithra |
బీజేపీ నాయకులను దూషిస్తే సహించేది లేదు..
X

దిశ ప్రతినిధి, నిర్మల్ : భారతీయ జనతా పార్టీ నాయకులను గాని కార్యకర్తలను గాని దూషిస్తే సహించేది లేదని బీజేపీ పట్టణ అధ్యక్షుడు సాదం అరవింద్ హెచ్చరించారు. సోమవారం పార్టీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ బీఆర్ఎస్ నాయకులు తమ బీజేపీ సీనియర్ నాయకుడు రావుల రామ్ నాథ్ ను ఉద్దేశించి మున్సిపల్ చైర్మన్ గండ్రత్ ఈశ్వర్ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. 35 ఏళ్ల నుండి ఏబీవీపీ నాయకుడిగా నక్సలైట్ దాడులను ఎదుర్కొని ప్రాణాన్ని పణంగా పెట్టి విద్యార్థి సమస్యల పై పోరాటం చేశారన్నారు.

తాను నమ్మిన పార్టీ సిద్ధాంతం కొరకు అంకిత భావంతో పనిచేసే ఆయనను దూషించే హక్కు అర్హత, పదవుల కోసం పార్టీలు మార్చే మున్సిపల్ చైర్మన్ కు లేదని ఎద్దేవా చేశారు. మున్సిపల్ లో 44 ఉద్యోగాలను అమ్ముకున్నారని, స్వంత పార్టీ సీనియర్ కౌన్సిలర్ నిరూపిస్తానంటూ చేసిన వ్యాఖ్యలకు సమాధానం చెప్పలేని మీరు స్థాయి గురించి మాట్లాడడం విడ్డూరమన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ ప్రధాన కార్యదర్శులు శ్రీరామోజి నరేష్, అల్లం భాస్కర్, ఉపాధ్యక్షులు, వట్నాల రాజు, మహేంద్ర నాథ్, ముడారపు దిలీప్, కందుల రవి పాల్గొన్నారు.

Advertisement

Next Story