- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మంచిర్యాల బీజేపీలో టికెట్ వార్..
దిశ, మంచిర్యాల టౌన్ : రాబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని మంచిర్యాల నియోజకవర్గం బీజేపీ ఎమ్మెల్యే టికెట్ కు మాజీ, ప్రస్తుత జిల్లా అధ్యక్షుల మధ్య పోరు కొనసాగుతుంది. 2018లో బీజేపీ నుంచి టికెట్ ఆశించిన ముల్కల్ల మల్లారెడ్డికి కాకుండా అధిష్టానం టికెట్ వేరే వ్యక్తికి ఇవ్వడంతో కొన్ని రోజులు మౌనంగా ఉన్నారు. మళ్లీ ఎన్నికల సమయం దగ్గరపడుతుందడడంతో మెళ్లిగా మళ్లీ తనపేరును తెరపైకి తెచ్చేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టారు. అభివృద్ది పనుల్లో పాలుపంచుకోవడం, పార్టీకి సంబంధించిన కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఇప్పుడు ఇదే విషయం చర్చ నియాంశంగా మారింది. ఎలక్షన్స్ కు ఒక సంవత్సరం ముందు జిల్లాకు కొత్తగా వచ్చిన రఘునాథ్ ను ఎన్ఆర్ఐ అని భావించిన అధిష్టానం ఎర్రబెల్లి రఘునాథ్ కి టికెట్ ప్రకటించడంతో మల్లారెడ్డి కాస్త అసహనం వ్యక్తం చేశాడు.
జిల్లాకు కొత్తగా వచ్చిన రఘునాథ్ కు నియోజక వర్గ ప్రజలకు ఎటువంటి సంబంధాలు లేనప్పటికీ అధిష్టానం టికెట్ ప్రకటించడంతో అధిష్టానం కోరిక మేరకు పార్టీలోనే పనిచేశాడు. కాగా 2018లో జరిగిన ఎన్నికల్లో మంచిర్యాల నియోజక వర్గ బీజేపీ ఎమ్మెల్యేగ పోటీ చేసిన రఘునాథ్ కు 4800 ఓట్లు వచ్చాయి. దాంతో రఘునాథ్ కాస్త దూకుడు పెంచి సొంత క్యాడర్ ను ఏర్పాటు చేసుకున్నాడు. సీనియర్ లను ఎవరిని పట్టించుకోక పోవడం, సొంత నిర్ణయాలు తీసుకోవడంతో పార్టీ సీనియర్ లు కాస్త రఘునాథ్ కు వ్యతిరేకంగ ఉన్నారు. ప్రజా సమస్యల పై నిత్యం పోరాడుతూ, ప్రతి గ్రామంలో బీజేపీ పార్టీ కార్యక్రమలు చేస్తూ ప్రజాదరన పొందాలని చూస్తున్నప్పటికీ, మంచిర్యాల బీజేపీ క్యాడర్ మాత్రం రఘునాథ్ కు వ్యతిరేకంగానే ఉంది. ముఖ్యంగా జిల్లా సీనియర్ నాయకులు మాజీ జిల్లా అధ్యక్షుడు గోనె శ్యాం సుందర్ రావుకు, రఘునాథ్ కు మధ్య చాలా వరకు గ్యాప్ పెరిగింది. ఇద్దరు ఒకే సామాజిక వర్గానికి చెందిన వారు అయినప్పటికీ వారి మధ్య విబేధాలు తార స్థాయికి చేరాయి.
రఘునాథ్ కి టికెట్ వస్తె శ్యాంసుందర్ రావ్ వర్గం ఏది రఘునాథ్ కి మద్దతు ఇవ్వరని మంచిర్యాల నాయకుల్లో చర్చ జరుగుతుంది. ఇటీవల 2020లో జరిగిన మున్సిపల్ ఎలక్షన్స్ లో బీజేపీ నుండి నస్పూర్ 21 వ వార్డు కౌన్సిలర్ గ గెలిచిన బెర సత్యనారాయణ, 18వ వార్డు కౌన్సిలర్ గా గెలిచిన లహరి విజయ్ లు దాదాపు రెండు సంవత్సరాలు బీజేపీలోనే పని చేసి రఘునాథ్ ఒంటెద్దు పోకడలు నచ్చకనే బీఆర్ఎస్ లో చేరారని మంచిర్యాల నియోజక వర్గ ప్రజలు, నాయకులు చర్చించకుంటున్నారు. దాంతో పాటు రఘనాథ్ కోవర్టు రాజకీయాలు చేస్తున్నాడని, పార్టీని అడ్డం పెట్టు కొని తన బిజినెస్ లు పెంచుకుంటున్నాడని ప్రజల్లో చర్చలు జరుగుతున్నాయి. ఎర్రబెల్లి రఘనాథ్ పై పార్టీ అధిష్టానానికి పలుసార్లు ఫిర్యాదులు వెళ్లడం, ఇటీవల జరిగిన సర్వేలో రఘునాథ్ కు విరుద్ధంగా రిపోర్టు పార్టీ అధిష్టానాన్ని కుదిపేసింది. ఈ సారి మంచిర్యాల నియోజక వర్గం నుండి బీజేపీ ఎంఎల్ఏ టికెట్ రఘునాథ్ కి ఇస్తే కనీసం ఓటు బ్యాంక్ కూడా రాదూ అనే ఆలోచనలో అధిష్టానంలో ఉన్నట్లు పలువురు చర్చించుకుంటున్నారు.
ఇవన్నీ గ్రహించిన మంచిర్యాల మాజీ జిల్లా అధ్యక్షుడు ముల్కల్ల మల్లారెడ్డి ముందుజాగ్రత్తగ అధిష్టానాన్ని కలిసి టికెట్ కోసం ప్రయత్నాలు చేస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. 2013 లో రాష్ట్ర అధ్యక్షుడుగా ఉన్న కిషన్ రెడ్డి ఆద్వర్యం లో బీజేపీలో చేరి 2014 లో మంచిర్యాల బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్తిగా పోటీ చేసిన మల్లారెడ్డి 12,700 ఓట్లు దక్కించుకున్నారు. దీనికి కారణం మల్లారెడ్డికి జిల్లాతో ఉన్న అనుబంధం. ఇప్పటికి పలువురు సీనియర్ నాయకులు సైతం మల్లారెడ్డితో చర్చలు జరిపుతున్నట్లు తెలుస్తుంది. పార్టీ పరంగాను, వ్యక్తిత్వంగాను మల్లారెడ్డినే బీజేపీకి సరైన క్యాండెట్ అని మంచిర్యాల నియోజక వర్గ ప్రజలు సైతం నమ్ముతున్నారు. 2014 లో బీజేపీ ప్రభావం అంతగా లేనప్పుడే మల్లారెడ్డి ఇతర పార్టీ అభ్యర్థుల్లకు గట్టి పోటీ ఇచ్చాడు. ఇపుడు బీజేపీ ఒక ఉన్నత స్థానంలోకి వచ్చింది, ఇలాంటి సమయాల్లో బీజేపీ నుండి మల్లారెడ్డికి టికెట్ వస్తే తప్పకుండా మెజారిటీ వచ్చే అవకాశాలు ఉన్నాయని పలువురు సీనియర్ నాయకులే చర్చించుకుంటున్నారు. ఏది ఏమైనప్పటికి అధిష్టానం మల్లారెడ్డికే టికెట్ అప్పగిస్తుందా లేక ఇంకెవరికి అయిన టికెట్ ను కట్టబెడుతుందా అన్నది వేచి చూడాల్సిందే.
ఇది ఇలా ఉండగా ఇటీవల మంచిర్యాల నియోజక వర్గంలో బీసీ ఎమ్మెల్యే వివాదం తెరపైకి వచ్చింది. నియోజక వర్గం లో మెజారిటీ ఓటర్లు బీసీలే ఉన్నపటికీ రాజకియాంగా ప్రాధాన్యం దక్కడం లేదు. అత్యధిక సంఖ్యలో బీసీలు ఉన్నపటికీ అన్ని రాజకీయా పార్టీలు చిన్నచూపు చూస్తున్నాయని లక్షెట్టిపేట్ కి చెందిన బీజేపీ నేత బొప్పూ సతీష్ మండిపడుతున్నారు. గత 25 సంవత్సరాలుగ బీజేపీ పార్టీలో పని చేస్తున్నానని, బీజేపీ పార్టీ కోసం ఎన్నో సార్లు జైలు జీవితాన్ని కూడా గడిపానని అన్నారు. మొదటి నుండి బీజేపీ పార్టీని పట్టుకొని ఏబీవీపీ కార్యకర్త స్థాయి నుండి జిల్లా స్థాయి వరకు వచ్చి, ఆర్ఎస్ఎస్ భావాలు కలిగి పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి పనిచేస్తున్నా తనను పార్టీ పెద్దలు పట్టించుకోవడం లేదు అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బీసీలం అంత ఏకమై ఈ సారి మంచిర్యాల నియోజకవర్గ బీజేపీ ఎమ్మెల్యే టికెట్ బీసీకి కేటాయించాలని అధిష్టానాన్ని కోరుతాం అన్నట్లు పలుచోట్ల ప్రచారం కూడా జరుగుతుంది. లక్షెట్టిపేట్ కు చెందిన మరొక బీసీ నేత సైతం మాజీ ఎంపీ వివేక్ ను కలిసి బీజేపీలో చేరే ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తుంది.
మంచిర్యాల నియోజక వర్గంలో 2.42 లక్షల మంది ఓటర్లకుగాను 1.65 లక్షల మంది బీసీలు ఉన్నారు. ఎస్సీ ల ఓట్లు 55 వేలు ఉండగా 15 వేలు ఎస్టీలు మరో, 15 వేలు క్రిస్టియన్ ఓటర్లు ఉన్నారు. నియోజక వర్గంలో రెడ్డి సామాజిక వర్గానికి చెందిన ఓట్లు 6 వేలు కాగా వెలమల ఓట్లు 2 వేలు ఉన్నట్లు అంచనా. కాగా పలు సామాజిక సమీకరణాల్లో భాగంగ మంచిర్యాల నుంచి బీసీని బరిలో నిలిపితే ఎలా ఉంటుంది అన్న విషయంలో పలు రాజకీయ పార్టీలు చేర్చించుకుంటున్నట్లు సమాచారం.