భూ కబ్జాలు చేసింది ఎవరైనా సరే విడిచి పెట్టేది లేదు..

by Sumithra |
భూ కబ్జాలు చేసింది ఎవరైనా సరే విడిచి పెట్టేది లేదు..
X

దిశ, సొన్ : సోన్ మండలంలోని పాక్ పట్ల గ్రామంలో మంత్రి భూ కబ్జాలకు పాల్పడుతున్న ప్రదేశాన్ని భారతీయ జనతా పార్టీ పెద్దపల్లి జిల్లా ఇంచార్జి రాష్ట్ర నాయకులు సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మంత్రి ఫామ్ హౌస్ ను ఆనుకుని ఉన్న పుష్కరఘాట్ల 20 ఫీట్ల రోడ్డును కబ్జాలకు గురిచేయడం అలాగే అసైన్డ్ భూములను ఏవిధంగా కబ్జా చేసారో అలా మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి భూకబ్జాలకు ఏ విధంగా పాటుపడుతున్నారో కబ్జా చేసిన రోడ్డును చూస్తే కబ్జా చేసిన గోదావరి తీర ప్రాంతంని చూస్తే ఏర్పడుతుందని అన్నారు. స్థానికంగా టీఆర్ఎస్ పార్టీ కార్యకర్త రైతుకు సంబంధించిన మూడు గుంటల భూమిని మంత్రి కబ్జాకు గురి చేయడం, వారి భూమిని ఇతరుల సర్వేనంబర్లలో ఉందని చెప్పడం మంత్రికి భూముల మీద ఉన్న ప్రేమ ప్రజల పాలన మీద లేదని అన్నారు.

జిల్లా కలెక్టర్ స్పందించి స్థానిక మంత్రి భూకబ్జాల బారి నుండి ప్రజలను కాపాడాలని మంత్రి పై చర్యలు తీసుకోవాలని అన్నారు. అలాగే ఫాం హౌజ్ లో మొరం మట్టి నింపడానికి స్థానిక ప్రజాప్రతినిధులను వేధించడం సిగ్గుచేటని పేర్కొన్నారు వెంటనే కబ్జా నుండి ప్రజలను ప్రభుత్వ భూములను కాపాడాలని కోరారు లేని పక్షంలో ప్రజల తరపున రైతుల తరపున బీజేపి పెద్ద ఎత్తున ఉద్యమిస్తుందని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో బీజేపి నాయకులు సోన్ మండల బీజేపి అధ్యక్షుడు మ్యాక ప్రేమ్ కుమార్ దళిత మోర్చ జిల్లా అధ్యక్షుడు రాచకొండ సాగర్ మండల గిరిజన మోర్చ అధ్యక్షుడు సుంకరి ముత్యం మండల కార్యదర్శి జక్క నర్సయ్య బీసి మోర్చ మండల అధ్యక్షుడు మేకల మల్లేష్ యాదవ్ నాయకులు వినోద్ ముత్యం తదితరులు ఉన్నారు.

Advertisement

Next Story