మందమర్రిలో బీజేపీ నాయకుల ముందస్తు అరెస్ట్

by S Gopi |
మందమర్రిలో బీజేపీ నాయకుల ముందస్తు అరెస్ట్
X

దిశ, మందమర్రి: మందమర్రిలో బీజేపీ నాయకులను బుధవారం ముందస్తు అరెస్టులు చేశారు. చెన్నూరు నియోజకవర్గంలో అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాలకు ఆర్థిక, ఆరోగ్య శాఖ తన్నీరు మంత్రి హరీష్ రావు విచ్చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జిల్లా వ్యాప్తంగా అరెస్టుల పర్వాన్ని కొనసాగించారు. అరెస్ట్ అయిన వారిలో ఆ పార్టీ మందమర్రి మండల అధ్యక్షులు పైడిమల్ల నర్సింగ్, పట్టణ అధ్యక్షులు సప్పిడి నరేష్, గడ్డం శ్రీనివాస్, ఎండీ మతిన్, వేల్పుల కిరణ్ లు ఉన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అక్రమ అరెస్టులు చేయడం వల్ల కేసీఆర్ ప్రభుత్వానికి ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతుందని అన్నారు. బీఆర్ఎస్ పార్టీ అంటేనే కుటుంబ పార్టీ అని విమర్శించారు. గారడి మాటలతో కేసీఆర్ రాష్ట్ర పగ్గాలు చేపట్టారని పేర్కొన్నారు.

Advertisement

Next Story