- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బాల్క సుమన్ చుట్టూ అసమ్మతి సెగ..!
దిశ, ప్రతినిధి నిర్మల్ : తెలంగాణ మలి దశ పోరులో విద్యార్థి ఉద్యమకారుడు.. రాష్ట్ర ఏర్పాటు తర్వాత ప్రత్యక్ష రాజకీయాల్లో అడుగుపెట్టిన ప్రభుత్వ విప్, చెన్నూరు ఎమ్మెల్యే బాల్క సుమన్ చుట్టూ సొంత జిల్లాలో అసమ్మతి సెగ రగులుకుంది. మంచిర్యాల జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడిగా ఆయన అధికార ఏకచత్రాధిపత్యం సాగిస్తున్నారని సొంత పార్టీ శ్రేణులే ఆరోపిస్తున్నాయి. తన సొంత నియోజకవర్గం చెన్నూరుతో పాటు మంచిర్యాల, బెల్లంపల్లి సెగ్మెంట్లలోనూ రాజకీయ ఆధిపత్యం చెలాయిస్తున్నారనే ఆరోపణలు తీవ్రమయ్యాయి.
పార్టీ అధినేతలు కేసీఆర్, కేటీఆర్ లకు బాల్క సుమన్ సన్నిహితుడిగా ఉండగా.. అధిష్టానం చెప్పిన పని చక్కబెట్టడడంలో నమ్మకస్తుడు. జిల్లాలో ఇద్దరు ఎమ్మె్ల్యేలపైనా వస్తున్న ఆరోపణలు కూడా ఆయన ఆధిపత్య దూకుడుకు కారణంగా కనిపిస్తోంది. ఇటీవలి సీఎం కేసీఆర్ పర్యటన తర్వాత జరుగుతున్న పరిణామాలను చూస్తే జిల్లాలో ఎమ్మెల్యే సుమన్ ఉద్దేశపూర్వకంగానే వచ్చే ఎన్నికల్లో తమను పక్కన పెట్టే ప్రయత్నం చేస్తున్నారని మంచిర్యాల, బెల్లంపల్లి ఎమ్మెల్యేల వర్గీయులు సన్నిహితుల వద్ద చెప్పుకుంటున్నట్టు తెలుస్తుంది.
రియల్టర్ జోక్యం వెనకాల..
రెండు దశాబ్దాలుగా మంచిర్యాలలో ప్రస్తుతం ఎమ్మెల్యే దివాకర్ రావు ఆధిపత్యం కొనసాగుతోంది. అంతేకాకుండా ఆయన పైన పలు ఆరోపణలు ఉన్నాయి. దీంతో ఆయనకు రాజకీయంగా చెక్ పెట్టేందుకు సుమన్ ప్రయత్నిస్తున్నారనే అనుమానాలు దివాకర్ రావు వర్గీయుల్లో తీవ్రమయ్యాయి. సీఎం సభ నేపథ్యంలో అదే ప్రాంతానికి చెందిన ప్రముఖ రియల్టర్ ను సుమన్ తెరపైకి తెచ్చారని, దీంతో స్థానిక ఎమ్మెల్యే వర్గీయులు ఆరోపణలు చేస్తుండగా.. దివాకర్ రావు తనయుడు విజిత్ రావు కూడా బాహాటంగానే ప్రశ్నించారని తెలుస్తుంది. ఎన్నడూ లేనిది ఆ రియల్టర్ మంచిర్యాలలో జోక్యం చేసుకోవడం వెనకాల బాల్క సుమన్ ఉన్నాడనేది అధికార పార్టీలో చర్చనీయాంశమైంది. అధిష్టానం చొరవతోనే సుమన్ ఇలా ముందుకెళ్తున్నారని సొంత పార్టీ నేతలే చెబుతున్నారు.
చిన్నయ్య వర్గీయులు సైతం..
ఇప్పటికే అనేక వివాదాల్లో పీకల్లోతు మునిగిన బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య వర్గీయులు సైతం బాల్క సుమన్ ను అనుమానిస్తున్నారు. ఆయన వైపే వేలెత్తి చూపుతున్నారు. వచ్చే ఎన్నికల్లో చిన్నయ్యను కాకుండా మరోవ్యక్తిని ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలో దింపేందుకు అధిష్టానం కసరత్తు చేస్తుందనే ప్రచారమూ ఊపందుకుంది. ఇందుకు బాల్క సుమన్ మరో నేతకు సపోర్ట్ చేస్తున్నట్లు పార్టీ వర్గాల్లో చర్చ నడుస్తోంది. అయితే.. దీన్ని సుమన్ వర్గీయులు కొట్టి పారేస్తున్నారు. ప్రభుత్వ విప్ హోదాతో పాటు మంచిర్యాల జిల్లా అధ్యక్షుడిగా అన్ని నియోజకవర్గాల్లోనూ పార్టీ గెలుపు కోసం ఆయన కృషి చేస్తున్నారని పేర్కొంటున్నారు. కొందరు కావాలనే పనిగట్టుకుని బాల్క సుమన్ పై దుష్ప్రచారం చేస్తున్నారని విమర్శిస్తున్నారు.