ఎండాకాలంలో వేశారు... వానాకాలంలో పోయింది

by Sumithra |
ఎండాకాలంలో వేశారు... వానాకాలంలో పోయింది
X

దిశ, కుబీర్ : కొత్తగా చేపట్టే ప్రభుత్వ పనులు పదికాలాల పాటు మన్నికగా ఉండి గ్రామంలో ఉండే పదిమందిచే కాంట్రాక్టర్ ని మెచ్చుకునేలా ఉండాలి. కానీ పనులు చేస్తున్నప్పుడే గ్రామస్థులు నాణ్యత పట్ల సోషల్ మీడియాలో వైరల్ చేసి కాంట్రాక్టర్ ని, అధికారులను సైతం పనులుజరుగుతున్నప్పుడే ఫిర్యాదు చేసేందుకు సిద్దమైనారు.

కుబీర్ మండలంలోని ఇస్లాపూర్ వెళ్లే రోడ్డు నుండి బెల్గాం తాండ వరకు లక్షల రూపాయల వ్యయంతో తారు రోడ్డును ఎండాకాలంలో వేశారు. కానీ వాన కాలం వచ్చేసరికే రోడ్లన్ని ఎక్కడికక్కడ కొట్టుకుపోయాయి. పనులు జరిగిన నాలుగు రోజుల నుంచే ఎడ్లబండ్లు వెళ్ళినా, వాహనాలు వెళ్లినా, తారు లేచి పోతూ ఉండడంతో ఇవేం పనులు అంటూ సోషల్ మీడియాలో గ్రామస్తులు వైరల్ చేశారు. నాసిరకం నాణ్యత లోపంతో జరిగిన రోడ్డు పనులను చూసి మండిపడ్డారు. ఉన్నత అధికారులకు ఫిర్యాదులు కూడా చేశారు. ఇంతలోనే వర్షాకాలం ప్రారంభం కావడంతో రోడ్డు విషయాన్నే మర్చిపోయారు.

కొట్టుకుపోయిన తారు రోడ్డు

అధికారుల పర్యవేక్షణ లేక కాంట్రాక్టర్లు ఇష్టారాజ్యంగా పనులు చేపట్టారు. తారు తక్కువ మందంలో, తక్కువ శాతంతో వేయడం వల్ల ఇటీవల కురిసిన వర్షాలకు కొట్టుకుపోయింది. పనులు జరుగుతున్నప్పుడే గ్రామస్థులు హెచ్చరించినా కాంట్రాక్టర్లు, అధికారులు పట్టించుకోలేదని గ్రామస్తులు అంటున్నారు. సంబంధిత శాఖ అధికారులు రోడ్డును పరిశీలించి కొట్టుక పోయిన రోడ్డును బాగు చేయించాలని, గుంతలను పుడ్చాలని, సంబంధిత కాంట్రాక్టర్ పై చర్యలు తీసుకోవాలని గ్రామస్థులు అంటున్నారు.

Advertisement

Next Story