స్వయంగా ప్రశంసా పత్రాన్ని రాసిన అడిషనల్ కలెక్టర్.. ఎవరికో తెలుసా..

by Sumithra |
స్వయంగా ప్రశంసా పత్రాన్ని రాసిన అడిషనల్ కలెక్టర్.. ఎవరికో తెలుసా..
X

దిశ, మంచిర్యాల : విధి నిర్వహణలో ప్రతిభ కనబరుస్తున్న పంచాయతీ సెక్రెటరీలను ప్రత్యేకంగా అభినందిస్తూ స్వయంగా తన చేతిరాతతో రాసిన లేఖలను అందిస్తున్నారు మంచిర్యాల లోకల్ బాడీస్ అడిషనల్ కలెక్టర్ బి. రాహుల్. ఇది ఉద్యోగుల బాధ్యతను పెంచేలా చేస్తుందని భావించిన ఆయన ఈ విధానానికి శ్రీకారం చుట్టారు. మంచిర్యాల జిల్లా భీమారం మండలం ఎల్కేశ్వరం గ్రామంలో (100శాతం బహిరంగ మలమూత్ర విసర్జన నిషేదం) ఓడీఎఫ్ గా ఈ మధ్యనే ఎంపికైంది. ఓడీఎఫ్ గా ఎంపికైనందుకు గానూ ఎల్కేశ్వరం గ్రామంలో తీసుకున్న చర్యలను క్షేత్రస్థాయిలో పరిశీలించేందుకు అడిషనల్ కలెక్టర్ ఈ మధ్యనే గ్రామసందర్శనకు వెళ్లారు.

దీంతో అక్కడ గ్రామపంచాయతీ సెక్రటరీ శ్రావ్య పనితీరును ప్రశంసిస్తూ లేఖను అందించారు. టార్గెట్లు, సూచనలు అందించి గ్రామాల్లో ప్రజావసరాలు తీర్చాలని చెబుతూ ముందుకు సాగే ఈ రోజుల్లో బాధ్యతతో గ్రామాభివృద్ధికి పంచాయతీ సెక్రటరీ చేస్తున్న కృషిని ఆయన ప్రశంసించారు. కాగా, తన పనితీరుకు అడిషనల్ కలెక్టర్ ప్రశంస తన బాధ్యతను మరింత పెంచిందని, రాబోయే రోజుల్లో మరింత రెట్టింపు అంకితభావంతో పనిచేస్తానని పేర్కొంటూ ఆమె అడిషనల్ కలెక్టర్ కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపింది.

Advertisement

Next Story

Most Viewed