పొనకల్ మండలం కోసం మరో ఉద్యమం..?

by Sumithra |
పొనకల్ మండలం కోసం మరో ఉద్యమం..?
X

దిశ, మామడ : మండలంలోని అతిపెద్ద గ్రామం పొనకల్. మండలానికి అవసరమయ్యే అన్ని మౌలిక వసతులు ఈ గ్రామంలో ఉన్నాయి. 10 గ్రామాల ప్రజలు కలిసికట్టుగా ఉండి 46 రోజుల పాటు రిలేనిరాహార దీక్షలు చేశారు. మహిళలు, రాజకీయ నాయకులు, యువకులు, రైతులు, చిన్నారులు సైతం మామడలో నిర్వహించిన వంటావార్పుతో నాయకుల గుండెల్లో వణుకు పుట్టి మండల ఏర్పాటు కోసం కృషి చేస్తామని చెప్పారు. మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి, మండల సాధన కమిటీ సభ్యులను హైదరాబాదుకు పిలిపించుకొని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అలాగే బాసర్ పర్యటనకు వచ్చినప్పుడు మంత్రి కేటీఆర్ లను కలసి వినతిపత్రం అందజేశారు.

నెలలు గడుస్తున్నా మండలం గురించి ఎలాంటి ప్రకటన చేయకపోవడంతో మళ్లీ ఉద్యమం చేయడానికి 10 గ్రామాల ప్రజలు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. మండలం ప్రకటించకపోతే రాజీనామాలు చేస్తామని గొప్పలు చెప్పిన ప్రజా ప్రతినిధుల మాటలు నీటి మూటలు అయ్యాయి. కొంత మంది నాయకులు అయితే ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్మల్ కలెక్టర్ భవన ప్రారంభోత్సవానికి వచ్చినప్పుడు మండలం గురించి ప్రకటన చేస్తారని చెపుతున్నారు. మండలం కోసం గ్రామంలోని దేవతామూర్తుల విగ్రహాలకు వినతిపత్రాలు ఇచ్చిన నాయకులకు కరుణ రావడం లేదని ఆయా గ్రామాల ప్రజలు వాపోతున్నారు. ఏది ఏమైనా పొనకల్ ను మండలంగా ప్రకటించకపోతే వచ్చే ఎన్నికల్లో వ్యతిరేకత ఉంటుందని మేధావులు అంటున్నారు.

Advertisement

Next Story

Most Viewed