- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
హెచ్చరికలు జారీ.. చర్యలు ఏవి అంటున్న ప్రజలు..
దిశ, రామకృష్ణాపూర్ : రామకృష్ణాపూర్ పట్టణంలో రోజురోజుకు పశువుల సంచారం పెరిగిపోతుంది. దీంతో ప్రజలు పలు ఇబ్బందులకు గురవుతున్నారు. కొంత మంది పశువులను ఇలా రోడ్డుపై వదిలేయడంతో రోడ్లపైనే సేద తీరుతున్నాయి. గద్దరేగడి జాతీయ రహదారిపై, బిజోన్ సెంటర్, రాజీవ్ చౌక్, సూపర్ బజార్, రామాలయం, రహదారులు, ప్రధాన కూడలులపై కూర్చోవడంతో పలు ప్రమాదాలు జరుగుతున్నాయి. పశువులు రాత్రిళ్లు రోడ్లపై కూర్చోవడంతో వాహనదారులు ప్రమాదాల బారిన పడుతున్నారు. ఇవేకాక పలు కాలనీలలోని ప్రజలు పశువుల వల్ల ప్రమాదాలకు గురైన సందర్భాలు కూడా లేకపోలేదు. ఎవరి పైన ఎవరికి ఫిర్యాదు చేయాలో తెలియడం లేదంటూ ప్రజలు ఆవేదన పడుతున్నారు.
పురఅధికారుల చర్యలేవి..
రోడ్డు మీదకు ఆవులు, గేదెలను వదిలితే యజమానులపై చర్యలు తీసుకుంటామంటూ హెచ్చరికలు జారీ చేసి నెలలు గడుస్తున్న పురపాలక అధికారులు చర్యలు తీసుకోవడంలో విఫలం అవుతున్నారని ప్రజలు మండిపడుతున్నారు. అధికారులు చర్యలు తీసుకోకపోవడంతో రోడ్లపైకి పశువులు యథేచ్చగా సంచరించడంతో ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇప్పటికైనా వాటి యజమానులు జాగ్రత్తలు తీసుకునే విధంగా పురఅధికారులు కట్టడి చేయాలని పట్టణ ప్రజలు, వాహనచోదకులు కోరుతున్నారు.