- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Aghori : యూట్యూబర్లపై పోలీసులకు అఘోరీమాత సోదరుడి ఫిర్యాదు... క్లారిటీ ఇచ్చిన పోలీసులు
దిశ,బెల్లంపల్లి : మంచిర్యాల జిల్లా నెన్నెల కుశ్నపల్లికి చెందిన అఘోరీ మాత సోదరుడు ఎల్లూరి రమేష్ యూట్యూబర్ల పై చర్య తీసుకోవాలని శనివారం పోలీసులకు ఫిర్యాదు చేశారని ప్రచారం జరుతున్న నేపథ్యంలో పోలీసులు క్లారిటీ ఇచ్చారు. అఘోరీ మాతపై యూట్యూబర్లు తప్పుడు కథనాలతో తమ కుటుంబం ప్రతిష్టకు భంగం కలిగించారని పోలీసులకు ఫిర్యాదు చేశారని, ఎంతో కాలానికి తమ సోదరుడు ఎల్లూరి శ్రీనివాసు (అఘోరీ మాత) ఇంటికొచ్చారని ఎల్లూరి రమేష్ పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు వార్తలు చక్కెర్లు కొగుతున్నాయి.
అఘోరీ మాతను రకరకాల ప్రశ్నలతో, ఇంటర్వ్యూల పేరుతో తమ కుటుంబాన్ని వేధించారని బాధితుడు వాపోయారని, తమ కుటుంబ ప్రతిష్టకు భంగం కలిగించారని ఫిర్యాదు చేసినట్టు ప్రచారం అవుతుంది. అంతేకాకుండా భయాందోళనకు గురిచేశారని, యూట్యూబ్ మీడియాపై తగిన చర్యలు తీసుకోవాలని రమేష్ పోలీసులను కోరాడని వార్తలు వినిపిస్తున్నాయి. కాగా అఘోరీ మాత సోదరుడు నుంచి ఎలాంటి ఫిర్యాదు తమకు అందలేదని నెన్నెల ఎస్ఐ ప్రసాద్ తెలిపారు.