Adilabad Collector : ఇంటింటి కుటుంబ సర్వే పారదర్శకంగా నిర్వహించాలి

by Aamani |
Adilabad Collector : ఇంటింటి కుటుంబ సర్వే పారదర్శకంగా నిర్వహించాలి
X

దిశ, ఆదిలాబాద్ : సామాజిక, ఆర్థిక, విద్య, రాజకీయ, కుల సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేను జిల్లాలో పారదర్శకంగా ఎలాంటి తప్పులకు తావివ్వకుండా, పకడ్బందీగా నిర్వహించాలని ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ రాజర్షి షా సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ అధికారులతో సమావేశం నిర్వహించారు.అనంతరం ఆయన మాట్లాడుతూ ఈ నెల 6వ తేదీ నుంచి ప్రారంభం కానున్న సామాజిక, ఆర్థిక ,విద్య, రాజకీయ,కుల సర్వే సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే పై ఎన్యుమరేటర్లు, మున్సిపల్ , గ్రామస్థాయిలో వార్డు నుంచి మొదలుకొని కేటాయించిన బ్లాక్ స్థాయి వరకు పూర్తిస్థాయిలో సమాచార సేకరణ,నమోదును అత్యంత జాగ్రత్తగా నిర్వహించాల్సిన అవసరం ఉందని సూచించారు.

సర్వే నిర్వహణలో ఏవైనా సందేహాలు తలెత్తి నట్లయితే వెంటనే నివృత్తి చేసుకోవాలని తెలిపారు.రాష్ట్ర ప్రభుత్వం ఈ సర్వేకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నదని,అదేవిధంగా సర్వే నిర్వహణ పట్ల ప్రత్యేక దృష్టి కేంద్రీకరించిందని తెలిపారు. ఈ సర్వేలో అందరినీ భాగస్వామ్యం చేయాలని, ఎన్యుమారెటర్లుగా నియమించిన టీచర్లకు శిక్షణ ఇవ్వడం జరిగిందని తెలిపారు. బుధవారం నుంచి ప్రారంభం కానున్న సర్వేను పకడ్బందీగా నిర్వహించాలని ఆదేశించారు.ఇందులో అదనపు కలెక్టర్ శ్యామలాదేవి,ఆర్డీవో వినోద్ కుమార్, జిల్లా అధికారులు, తదితరులు ఉన్నారు.

Advertisement

Next Story

Most Viewed