అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి

by sudharani |   ( Updated:2022-11-27 07:21:55.0  )
అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి
X

దిశ, భైంసా : నిర్మల్ జిల్లా భైంసా పట్టణంలోని ఒవైసినగర్‌కు చెందిన వాహిద్ ఖాన్(60) అనే వ్యక్తి అనుమానాస్పదంగా మృతిచెందాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పట్టణంలోని ఒవైసినగర్‌కు చెందిన వాహిద్ ఖాన్ (60) చిరు వ్యాపారం చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. గత రెండు రోజుల క్రితం కుటుంబ సభ్యులు వేరే ఊరికి వెళ్లడంతో ఇంట్లో ఒక్కడే ఉన్నాడు. శనివారం ఎంత సేపటికి వాహిద్ బయటికి రాకపోవడంతో అనుమానం వచ్చి స్థానికులు కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు.

సాయంత్రానికి కుటుంబ సభ్యులు వచ్చి చూసేసరికి వాహిద్ విగతజీవిగా పడి ఉన్నాడు. వెంటనే కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం అందించడంతో.. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతికి గల వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఆదివారం ఉదయం స్థానిక ఏరియా ఆసుపత్రిలో మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.



Also More......

యాజమాన్యం వేధింపులు తాళలేక పెట్రోల్ పోసుకుని యువకుడు ఆత్మహత్యాయత్నం

Advertisement

Next Story