- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కేసీఆర్ పాలనలోనే తెలంగాణ అభివృది : మంత్రి ఐకే రెడ్డి
దిశ, దిలావర్పూర్ : దిలావర్పూర్ మండలంలోని సిర్గాపూర్ లో నిర్వహించిన భారతీయ రాష్ట్రసమితి కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనంలో రాష్ట్ర దేవాదాయ, న్యాయ, అటవీ శాఖ మంత్రివర్యులు ఇంద్రకరణ్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం కేసీఆర్ పాలనలో అభివృద్ధి చెందుతుందని, తెలంగాణ ఆకాంక్ష నీళ్లు, నిధులు, నియమాకాలు ఈ రంగాలలో తెలంగాణ ఎంతో అభివృద్ధి సాధించిందని తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయం ఎంతో పురోగతి సాధించిందని గతంలో వ్యవసాయ రంగానికి అనేక కష్టాలు ఉండేవని ఆయన అన్నారు. నేడు రైతులందరూ చాలా సంతోషంగా ఉన్నారని, రైతులకు రైతుబంధు, 24 గంటల ఉచిత విద్యుత్తు, రైతు బీమా వంటి పథకాల ద్వారా తెలంగాణలో రైతులు ఆర్థిక పురోగతి సాధించారని తెలిపారు. ఈ సంవత్సరం విద్యుత్ రంగంలో కాస్త సాంకేతిక సమస్య వల్ల విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడడంతో ప్రతిపక్షాలు పనిగట్టుకుని రోడ్లపైకి వచ్చారని ముఖ్యమంత్రితో మాట్లాడి సమస్యను పరిష్కరించామని తెలిపారు.
ఇప్పుడు ప్రతిపక్షాలకు పనిలేకుండా పోయిందని ఆయన ఎద్దేవా చేశారు. వారం రోజుల నుండి వీచిన ఈదురుగాలకు పంట నష్టపోవడంతో పంట నష్టపరిహారం కింద ఎకరానికి 10,000 రూపాయలు నష్టపరిహారం చెల్లించడానికి ముఖ్యమంత్రి అంగీకరించాలన్నారు. ఈ విషయంలో ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు. గతంలో పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేయడానికి అనేక ఇబ్బందులు ఉండేవని ఇప్పుడు మొత్తం ధాన్యాన్ని ప్రభుత్వమే కొంటుందన్నారు. కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాల ద్వారా పేదఇంటి ఆడపడుచులకు పెళ్ళికానుక లక్ష 16 వేలు ఇస్తున్నామన్నారు. పాఠశాలల అభివృద్ధిలో భాగంగా పిల్లలకు నాణ్యమైన విద్యను అందించడానికి మన ఊరు మనబడి అనే కార్యక్రమం ద్వారా ప్రైవేటు పాఠశాలలకు ధీటుగాతీర్చిదిద్దిందన్నారు.
బీజేపీ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుందని దేశ రాజధానిలో మహిళ రిజర్వేషన్ పై పోరాడుతున్నందుకు కేసీఆర్ కూతురు కవిత పై సీబీఐ, ఈడీల పేరుతో కేసులు పెడుతున్నారన్నారు. ప్రశ్నాపత్రం లీకేజీ విషయంలో మంత్రి కేటీఆర్ పై ప్రతిపక్షాలు అనవసరంగా బురద జల్లుతున్నారని అన్నారు. తాను మీడియాతో మాట్లాడిన మాటలను వక్రీకరించి అసత్య ప్రచారాలు చేస్తున్నారని ఆయన అన్నారు. నిర్మల్ జిల్లాను అన్నిరంగాలలో అభివృద్ధి చేస్తున్నామని నిర్మల్ జిల్లాలో సమీకృత కలెక్టర్ భవనాన్ని నిర్మించాలని దానిని మే నెలలో ముఖ్యమంత్రి ప్రారంభిస్తారన్నారు. ప్రశ్నాపత్రం లీకేజీ విషయంలో అనవసరంగా ఆధారం లేకుండా మాట్లాడుతున్న ప్రతిపక్ష నాయకులను సీట్ విచారణ చేస్తుందని ఆధారాలు సీట్ ముందు ఉంచాలని కోరారు. తెలంగాణ రాష్ట్రంపై కేంద్ర ప్రభుత్వం సవతి తల్లి ప్రేమ చూపిస్తుందని నష్టానికి రావలసిన నిధులను విడుదల చేయడం లేదన్నారు.
నిర్మల్ నియోజకవర్గంలో 3000 ఇండ్లు నిర్మాణం కొరకు డబ్బులను విడుదల చేస్తామని ఎవరైతే సొంత జాగ ఉన్నవారు నిర్మించుకోవడానికి ముందుకు రావాలన్నారు. ఇన్ని అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్న కేసీఆర్ ప్రభుత్వాన్ని కాకుండా ఇతర పార్టీకి ప్రజలు ఓటు వేస్తారా అని కార్యకర్తలను ప్రశ్నించారు. రానున్న రోజులలో ప్రతి ఒక్క కార్యకర్త విభేదాలను పక్కనపెట్టి పార్టీ అభివృద్ధి కొరకు పాటుపడాలని, ఈ సంవత్సరం చివరి నెలలో ఎన్నికలు ఉంటాయని మళ్లీ భారతీయ రాష్ట్ర సమితి అధికారం చేపడుతుందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో అల్లోల మురళీధర్ రెడ్డి, నిర్మల్ మున్సిపల్ చైర్మన్ గండ్రత్ ఈశ్వర్, ఎంపీపీ పల్దే అక్షర అనిల్ పార్టీ మండలఅధ్యక్షులు దేవేందర్ రెడ్డి, నిర్మల్ మార్కెట్ కమిటీ చైర్మన్ వెంకట రమణ, రైతు సమన్వయ సమితి జిల్లా అధ్యక్షులు నల్ల వెంకట్ రామ్ రెడ్డి, ఎఫ్ఏసీఎస్ చైర్మన్ దశరథ రాజేశ్వర్, పీఎసీఎస్ చైర్మన్ పి వెంకట రమణ రెడ్డి, రైతుబంధు సమన్వయ సమితి జిల్లా అధ్యక్షుడు నల్ల వెంకటరామిరెడ్డి, గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఎర్రవోతు రాజేందర్, మండల పరిషత్ ఉపాధ్యక్షులు బాబురావు, జిల్లా కో ఆప్షన్ సభ్యులు సుభాష్ రావు, నాయకులు శ్రీనివాస్, అనిల్, ఒడ్నం కృష్ణ, ఇట్టెడిగంగారెడ్డి, కదిలి కాల్వ టెంపుల్ చైర్మన్ లు, వివిధ గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, మండల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.