అటవీ భూమిని అక్రమంగా దున్నిన వారిపై కేసునమోదు : మూడు ట్రాక్టర్లు సీజ్

by Sumithra |
అటవీ భూమిని అక్రమంగా దున్నిన వారిపై కేసునమోదు : మూడు ట్రాక్టర్లు సీజ్
X

దిశ, భీమిని : భీమిని మండలంలోని కర్జిభీంపుర్ గ్రామపంచాయతీ పరిధిలోగల 416/2 సర్వేనంబర్ గల అటవీ భూమిని అక్రమంగా దున్నిన ముగ్గురి పై కేసునమోదు చేసి మూడు ట్రాక్టర్లను సీజ్ చేసినట్లు ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ సుభాష్ తెలిపారు. బాధితులు గతంలో ఐటీడీఏ నుంచి పట్టాలు ఉన్నాయని ఆ భూమి మాది అంటూ బుధవారం మూడు ట్రాక్టర్లతో ఆటవి భూమిని దున్నారు. స్థానికులు ఫారెస్ట్ అధికారులకు సమాచారం అందించడంతో ఫారెస్టు అధికారులు అడ్డుకొనీ ట్రాక్టర్లను బెల్లంపల్లి అటవీ కార్యాలయానికి తరలించారు.

పట్టాలు ఉన్నాయంటూ తెలిపి ఆ భూమికి సంబందించిన పత్రాలను గురువారం ఫారెస్ట్ అధికారులకు సమర్పించారు. ఫారెస్ట్ అధికారులు ఆ పత్రాలను పరిశీలించి ఆటవి భూములను దున్నినట్లు నిర్ధారించారు. అక్రమంగా అటవీ భూమిని దున్నిన ఎడ్ల దేవాజి, బత్తిని సాగర్, పెద్దింటి రాకేష్ లపై కేసు నమోదు చేసి మూడు ట్రాక్టర్లను సీజ్ చేశారు. కర్జి భీంపూర్ గ్రామంలోనీ అటవీ భూముల్లో ట్రాక్టర్ల ద్వారా అటవీ భూములను దున్నితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అధికారులు వెల్లడించారు. అటవీ అధికారులు సెక్షన్ అధికారి శ్రీనివాస్ బీట్ ఆఫీసర్ భాస్కర్ లో ఉన్నారు.

Advertisement

Next Story

Most Viewed