- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అందుకే ఆ భార్యాభర్తలపై కేసు నమోదు చేశారా..
దిశ, మామడ : పంట పొలాల చుట్టూ విద్యుత్ కంచెలు ఏర్పాటు చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని సీఐ రామ్ నరసింహారెడ్డి అన్నారు. మండలంలోని కిషన్ రావుపేట్ గ్రామంలోని పంట పొలాలను విద్యుత్ శాఖ అధికారులతో కలిసి పరిశీలించారు. మేడిపల్లి గ్రామానికి చెందిన భార్యాభర్తలు దేవన్న, లింగవ్వలు తన పంటచెన్లో విద్యుత్ కంచెలు ఏర్పాటు చేయడంతో సీఐ ఆగ్రహం వ్యక్తం చేశారు. అడవిజంతువుల రక్షణకోసం విద్యుత్ తీగలు ఏర్పాటు చేయడం వలన రైతులు చనిపోతున్నారని, అలాగే పశువులు కూడా మృత్యువాత పడుతున్నాయని ఆయన పేర్కొన్నారు. వీరిద్దరి పై మూడు సెక్షన్ల కింద కేసు నమోదు చేశామన్నారు. అన్ని గ్రామాల్లో ఉన్న పంట పొలాల్లో తనిఖీలు చేసి ఎవరైనా విద్యుత్ కంచెలు ఏర్పాటు చేస్తే వారిపై కేసు నమోదు చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో విద్యుత్ శాఖ అధికారులు ఇంచార్జి ఎస్సై రాహుల్ , పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.