100 శాతం అక్షరాస్యత సాధించాలి

by Sridhar Babu |
100 శాతం అక్షరాస్యత సాధించాలి
X

దిశ, ఆసిఫాబాద్ : జిల్లాలో 100 శాతం అక్షరాస్యత సాధించేలా అధికారులు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ వెంకటేష్ ధోత్రే అన్నారు. మంగళవారం కలెక్టరేట్ లో జిల్లా అదనపు కలెక్టర్ దీపక్ తివారీతో కలిసి వయోజన విద్యాశాఖ ఆధ్వర్యంలో చేపట్టిన నవభారత అక్షరాస్యత కార్యక్రమంపై అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.

నవభారత అక్షరాస్యత కార్యక్రమంలో భాగంగా జిల్లాలో 100 శాతం అక్షరాస్యత సాధించేలా అధికారులు పనిచేయాలని సూచించారు. నిరక్ష్యరాస్యులను గుర్తించేందుకు డిగ్రీ పూర్తి చేసిన విద్యార్థులను వాలంటీర్లుగా నియమించి వారిని అక్షరాస్యులుగా తీర్చిదిద్దాలని ఆదేశించారు. అంగన్వాడీ టీచర్లు, ఉపాధ్యాయులు, సహాయకులు తమ పరిధిలోని నిరక్ష్యరాస్యులను గుర్తించి వారి వివరాలు నమోదు చేయాలని కోరారు. సెర్ప్, మెప్మా సిబ్బంది కూడా ఇందుకు కృషి చేయాలని ఆదేశించారు.

Next Story

Most Viewed