- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ప్రవళిక ఆత్మహత్య కేసులో కీలక మలుపు.. నిందితుడు శివరాంకు బెయిల్
దిశ, తెలంగాణ క్రైం బ్యూరో: సంచలనం సృష్టించిన ప్రవళిక ఆత్మహత్య కేసులో నిందితునిగా ఉన్న శివరాం రాథోడ్‌కు కోర్టు శనివారం బెయిల్మంజూరు చేసింది. ప్రవళిక ఆత్మహత్యకు శివరాం రాథోడ్ కారకుడని పేర్కొనటానికి సరైన సాక్ష్యాధారాలు లేవని కోర్టు పేర్కొనటం గమనార్హం. ఈనెల 13న అశోక్‌నగర్ ప్రాంతంలోని బృందావన్ హాస్టల్లో ప్రవళిక సీలింగ్ ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. గ్రూప్2 పరీక్ష వాయిదా పడటం వల్లనే ఆమె ఆత్మహత్య చేసుకుందన్న వార్త దావనంలా వ్యాపించటంతో అదే రోజు రాత్రి వేలాది సంఖ్యలో విద్యార్థులు అశోక్నగర్చౌరస్తా ప్రాంతంలో ఆందోళన నిర్వహించారు. దీనికి వేర్వేరు పార్టీలకు చెందిన నాయకులు, విద్యార్థి సంఘాల నేతలు సంఘీభావం ప్రకటిస్తూ నిరసనలో పాల్గొన్నారు. అప్పట్లో ఈ విషాదం రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపింది. కాగా, ప్రవళిక ఆత్మహత్య చేసుకున్న మరుసటి రోజునే సెంట్రల్జోన్డీసీపీ వెంకటేశ్వర్లు మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి ప్రవళిక ఆత్మహత్యకు ప్రేమ వ్యవహారమే కారణమని చెప్పారు.
శివరాం రాథోడ్ అనే యువకుడు ప్రేమించానని చెప్పి మరో యువతితో నిశ్చితార్థం చేసుకోవటం వల్లనే ఆమె ప్రాణాలు తీసుకుందని తెలిపారు. అసలు, ప్రవళిక గ్రూప్2 పరీక్షకు దరఖాస్తు కూడా చేయలేదన్నారు. మంత్రి కేటీఆర్ కూడా ప్రవళిక ఆత్మహత్యకు ప్రేమ వ్యవహారమే కారణమని చెబుతూ ఆమె కుటుంబానికి న్యాయం చేస్తామని ప్రకటించారు. ఆ తరువాత ఆమె కుటుంబసభ్యులను తన వద్దకు పిలిపించుకుని మాట్లాడారు కూడా. అయితే, ఆ తరువాత ప్రవళిక ఒక్క గ్రూప్2 కాకుండా గ్రూప్1, 3, 4 పరీక్షలకు కూడా దరఖాస్తులు చేసుకున్నట్టుగా హాల్‌టిక్కెట్లు వెలుగు చూడటం సంచలనం సృష్టించింది. అప్పటికే చిక్కడపల్లి పోలీసులు శివరాం రాథోడ్‌పై ఐపీసీ 420, 417, 306 సెక్షన్ల ప్రకారం కేసులు కూడా నమోదు చేశారు. అతన్ని పట్టుకోవటానికి ప్రత్యేక బృందాలను సైతం రంగంలోకి దింపారు.
ఈ క్రమంలో పూణె వెళ్లిన ప్రత్యేక పోలీసుల బృందం.. శివరాం రాథోడ్ బంధువులు కొందరిని అదుపులోకి తీసుకుని చిక్కడపల్లి పోలీస్‌స్టేషన్‌లో నిర్భంధించింది. శివరాం రాథోడ్ ఆచూకీ చెప్పాలంటూ పోలీసులు వారిని తమదైన శైలిలో విచారణ కూడా జరిపారు. దాంతో శివరాం రాథోడ్ తండ్రి నేనావత్ కిషన్ రాథోడ్ మానవ హక్కుల సంఘాన్ని ఆశ్రయించాడు. ప్రవళిక ఆత్మహత్యతో తన కుమారునికి ఎలాంటి సంబంధం లేదని పిటీషన్‌దాఖలు చేశారు. ప్రవళిక ఆత్మహత్య నేపథ్యంలో వస్తున్న విమర్శల నుంచి తప్పించుకునేందుకు తన కుమారున్ని కేసులో ఇరికించారని పేర్కొన్నారు. తమ బంధువులు కొందరిని పోలీసులు అదుపులోకి తీసుకుని వేధిస్తున్నట్టుగా తెలిపారు.
ఆ మరుసటి రోజునే...
ఇదిలా ఉండగా శుక్రవారం శివరాం రాథోడ్ నాంపల్లిలోని 9వ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ కోర్టులో లొంగిపోవటానికి వచ్చాడు. ఈ క్రమంలో కోర్టుకు సరెండర్ పిటీషన్ కూడా దాఖలు చేశాడు. అయితే, శివరాం రాథోడ్ తరపున దాఖలైన సరెండర్ పిటీషన్లో సాంకేతిక పొరపాట్లు ఉండటంతో అది తిరస్కరణకు గురైంది. దాంతో శివరాం రాథోడ్ కోర్టు బయటకు రాగా.. అప్పటికే అక్కడ మాటు వేసి ఉన్న చిక్కడపల్లి పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. శనివారం శివరాం రాథోడ్ కు గాంధీ ఆస్పత్రిలో వైద్య పరీక్షలు జరిపించిన అనంతరం కోర్టులో హాజరుపరిచారు. జ్యుడిషియల్ రిమాండ్ విధించాల్సిందిగా కోర్టును అభ్యర్థించారు.
5వేల పూచీకత్తుపై బెయిల్...
కాగా, కోర్టు శివరాం రాథోడ్ కు 5వేల రూపాయల పూచీకత్తుపై బెయిల్ మంజూరు చేసింది. ప్రవళిక ఆత్మహత్య చేసుకోవటానికి శివరాం రాథోడ్ కారణమని నిర్ధారించటానికి ఎలాంటి సాక్ష్యాధారాలు లేవని కోర్టు పేర్కొనటం గమనార్హం. ఇటువంటి పరిస్థితుల్లో శివరాం రాథోడ్‌ను జ్యుడిషియల్రిమాండ్కు పంపించలేమన్న కోర్టు అతనికి బెయిల్ మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.