- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఇంతదూరం వస్తుందనుకోలేదు.. ప్రీతి డెత్ కేసులో ‘సైఫ్’ సమాధానమిదే!
దిశ, తెలంగాణ క్రైం బ్యూరో: ‘ఒక సీనియర్‌గా ప్రీతిని గైడ్ చేయాలని మాత్రమే చూశా.. కానీ ఇంతదూరం వస్తుందనుకోలేదు.’ ప్రీతి డెత్ కేసులో పోలీసులు అడిగిన ప్రతి ప్రశ్నకు సీనియర్ అయిన సైఫ్ ఇదే సమాధానమిచ్చినట్లు తెలిసింది. వాట్సాప్ గ్రూప్లో ప్రీతిని హేళన చేస్తూ పెట్టిన పోస్టింగులపై అడుగగా, అవి తానే పెట్టినట్లు అంగీకరిస్తూనే.. ఇంతదూరం వస్తుందనుకోలేదని ఆన్సర్ ఇచ్చినట్లు సమాచారం. కాస్త గట్టిగా చెబితే ప్రీతి తన పని తీరును మెరుగు పరుచుకుంటుందని భావించానని చెప్పినట్లు తెలిసింది. అయితే సైఫ్ నుంచి పోలీసులు పెద్దగా వివరాలు రాబట్టలేకపోయినట్లు సమాచారం.
దీంతో మరో రెండు రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ వాయిదా పడటంతో సైఫ్ ను ఖమ్మం జిల్లా జైలుకు తరలించారు. సైఫ్ నుంచి విలువైన సమాచారం రాకపోవటంతో దర్యాప్తు అధికారులు ఆమె సహ విద్యార్థినులు, హెడ్ నర్స్, నర్సుల నుంచి వివరాలు తెలుసుకోవాలని నిర్ణయించినట్లు తెలిసింది. వీరిని మరోమారు క్షుణ్ణంగా విచారిస్తే కేసుకు సంబంధించి కీలక వివరాలు బయటపడవచ్చరని పోలీసులు భావిస్తున్నారు.
డీజీపీని కలిసిన ప్రీతి కుటుంబసభ్యులు
కాగా, ప్రీతి కుటుంబ సభ్యులు సోమవారం డీజీపీ అంజనీ కుమార్ ను కలిశారు. ప్రీతిది హత్యేనని అనుమానం వ్యక్తం చేశారు. దీంతో పూర్తిస్థాయిలో విచారణ చేపడుతామని డీజీపీ హామీ ఇచ్చారు. మరోవైపు వరంగల్ కమిషనర్ రంగనాథ్ మీడియాతో మాట్లాడారు. ఫోరెన్సిక్ రిపోర్టు, పోస్టుమార్టం నివేదిక అందితే ఈ కేసులో చాలా అనుమానాలకు తెరపడుతుందన్నారు. ఇవి రావటానికి ఒకటీ రెండు, రోజులు పట్టవచ్చన్నారు. కొందరు ప్రీతి ఉదంతాన్ని రాజకీయంగా వాడుకోవాలని చూస్తున్నారని వ్యాఖ్యానించారు.
Also Read...అంతా ఆమె కోసమే చేశా.. నవీన్ హత్య కేసు నిందితుడు హరిహరకృష్ణ