ACB: సంక్షేమ హాస్టళ్లలో దారుణ పరిస్థితులు.. ప్రభుత్వానికి సమగ్ర నివేదిక అందజేస్తాం

by Gantepaka Srikanth |
ACB: సంక్షేమ హాస్టళ్లలో దారుణ పరిస్థితులు.. ప్రభుత్వానికి సమగ్ర నివేదిక అందజేస్తాం
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ వ్యాప్తంగా పది సంక్షేమ వసతి గృహాల్లో ఏసీబీ అధికారులు నిర్వహించిన సోదాలు ముగిశాయి. బీసీ, ఎస్సీ, మైనార్టీ హాస్టళ్లలో మంగళవారం తనిఖీలు నిర్వహించారు. హాస్టళ్లలో ఎంతమంది విద్యార్థులు ఉంటున్నారు. రికార్డుల్లో ఎంతమంది పేర్లు నమోదు చేశారు. ఇలా అనేక అంశాలపై ఆరా తీశారు. ఆహారం నాణ్యత, విద్యార్థులకు అందిస్తున్న సౌకర్యాలకు సంబంధించిన వివరాలను సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు. తెల్లవారుజామున ప్రారంభించిన ఈ దాడులు సాయంత్రం ముగిశాయి. అంతకుముందు హాస్టల్ మొత్తం కలియదిరిగారు. పరిసరాలను పరిశీలించారు.

వంటశాలల్లో అపరిశుభ్రత, తాగునీటి సదుపాయం లేనట్లు ఏసీబీ దాడుల్లో స్పష్టమైంది. విద్యార్థులకు నాణ్యతలేదని ఆహారం పెడుతున్నట్లు గుర్తించారు. అంతేకాదు.. అధికారులు సరిగా రిజిష్టర్లు మెయింటైన్ చేయకపోవడాన్ని చూసి అసహనం వ్యక్తం చేశారు. తమ దాడుల్లో గుర్తించిన ప్రతీ అంశాన్ని సమగ్రంగా ప్రభుత్వానికి నివేదిక సమర్పిస్తామని దాడుల అనంతరం ఏసీబీ అధికారులు తెలిపారు. కాగా, పలు ఫిర్యాదులు వచ్చిన నేపథ్యంలో ఈరోజు (మంగళవారం) ఉదయం బ్రేక్ ఫాస్ట్‌కు ముందే హాస్టల్‌లో సోదాలు చేపట్టారు. ఫుడ్ సేఫ్టీ అధికారులు ఫుడ్‌కి సంబంధించిన కొన్ని పదార్థాలను సీజ్ చేసి ల్యాబ్ పంపనున్నారు.

Advertisement

Next Story

Most Viewed