- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
తెలంగాణ నుంచి రాజ్యసభ అభ్యర్థిగా అభిషేక్ సింఘ్వీ నామినేషన్
దిశ, వెబ్ డెస్క్: మాజీ బీఆర్ఎస్ నేత కేకే కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత తన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. దీంతో కాళీ అయిన స్థానానికి కేంద్ర ఉప ఎన్నికకు నోటిఫికేషన్ జారీ చేసింది. దీంతో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత అయిన అభిషేక్ సింఘ్వీ అభ్యర్థిగా ప్రకటించిన విషయం తెలిసిందే. కాగా ఆదివారం హైదరాబాద్ వచ్చిన సింఘ్వీ రాష్ట్ర కాంగ్రెస్ నేతలతో భేటీ అయ్యారు. ఈ రోజు ఉదయం ఆయన తెలంగాణ శాసన సభకు చేరుకుని రాజ్యసభ ఉప ఎన్నికకు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నామినేషన్ వేశారు. ఈ సందర్భంగా నామినేషన్ పత్రాలను లోక్ సభలో ఉప ఎన్నికల రిటర్నింగ్ అధికారికి అందించారు. ఈ నామినేషన్ కార్యక్రమానికి సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు, దీపా దాస్ మున్షీ, ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ పార్టీ నేతలు హాజరయ్యారు. కాగా ఆదివారం జరిగిన సీఎల్పీ సమావేశంలో సింఘ్వీ మాట్లాడుతూ.. తెలంగాణ ప్రజల వాయిస్ ను చట్టసభల్లో బలంగా వినిపిస్తానని చెప్పుకొచ్చారు.