ఆరు నూరైనా.. ఓడేది కారు.. రేవంత్ రెడ్డి ఇంట్రెస్టింగ్ ట్వీట్

by Sathputhe Rajesh |   ( Updated:2023-10-10 13:12:52.0  )
ఆరు నూరైనా.. ఓడేది కారు.. రేవంత్ రెడ్డి ఇంట్రెస్టింగ్ ట్వీట్
X

దిశ, వెబ్‌డెస్క్: టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ట్విట్టర్ వేదికగా తెలంగాణ ఎలక్షన్స్ ఇంట్రెస్టింగ్ ట్వీట్ చేశారు. ‘ఆరు వారాలు.. ఆరు హామీలు.. ఆరు నూరైనా ఓడేది కారు.. హస్తం గెలుపు ఖరారు’ అంటూ పోస్ట్ చేశారు. ఈ పోస్ట్ కు జత చేసిన ఫోటోలో రేవంత్ రెడ్డి ఎర్రజెండా కప్పుకుని ఉండటం గమనార్హం. ఇక కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారంటీలు ప్రకటించిన తర్వాత దూకుడు పెంచింది. పార్టీలోకి ముఖ్య నేతలు క్యూ కట్టడంతో ఆ పార్టీలో జోష్ పెరిగింది. బీజేపీ అధ్యక్షుడి మార్పు తర్వాత ఆల్టర్నేట్ నుంచి థర్డ్ ప్లేస్ లోకి వెళ్లగా కాంగ్రెస్ పార్టీ ప్రత్యామ్నాయం తామే అంటూ ప్రచారం మొదలుపెట్టారు. ఎంఐఎం, బీఆర్ఎస్ నేతలు సైతం రేవంత్ రెడ్డిని టార్గెట్ చేస్తూ వరుసగా కామెంట్లు చేస్తున్నారు. ఇక నవంబర్ 30న తెలంగాణలో ఎన్నికలు జరగనుండగా డిసెంబర్ 3న ఫలితాలు రానున్న విషయం తెలిసిందే.

Advertisement

Next Story

Most Viewed