- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
Aadi Srinivas: గవర్నర్ అంటే గౌరవం లేదు.. స్పీకర్ అంటే లెక్క లేదు.. ఆది శ్రీనివాస్ హాట్ కామెంట్స్

దిశ, వెబ్‌డెస్క్: గవర్నర్ (Governor) ప్రసంగం గాంధీభవన్ (Gandhi Bhavan)లో ప్రెస్‌మీట్‌లాగా ఉందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ (KTR) అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద సంచలన వ్యాఖ్యలు చేశారు. గత 15 నెలల అట్టర్ ప్లాప్ పాలనపై ప్రాయశ్చిత్తం ఉంటుందని అనుకున్నామని ఆయన కామెంట్ చేశారు. సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) చేతకానితనం వల్లే రాష్ట్రంలో పంటలు ఎండిపోతున్నాయని ఆరోపించారు. రాష్ట్రంలో 30 శాతానికి మించి రైతు రుణమాఫీ (Farmer Loan Waiver) జరగలేదని.. గవర్నర్ (Governor) ప్రసంగంలో కాంగ్రెస్ ప్రభుత్వం (Congress Government) అన్నీ అబద్ధాలే చెప్పించిందని ఫైర్ అయ్యారు. 20 శాతం కమీషన్ తప్ప.. ఏ విజన్ లేని సర్కార్ ఇదేనని కేటీఆర్ అన్నారు.
ఈ క్రమంలోనే కేటీఆర్ (KTR) చేసిన వ్యాఖ్యలపై ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ (Aadi Srinivas) స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ప్రతిపక్ష సభ్యులకు గవర్నర్ (Governor) అంటే గౌరవం లేదని.. స్పీకర్ (Speaker) అంటే లెక్క లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అసెంబ్లీ బయట బీఆర్ఎస్ (BRS) నేతలు వ్యవహరిస్తున్న తీరును ఆయన తీవ్రంగా ఖండించారు. కాంగ్రెస్ ప్రభుత్వం (Congress Government) రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తు్న్న ప్రజారంజక సంక్షేమ కార్యక్రమాలను చూసి గులాబీ పార్టీ (Pink Party) నేతలకు గుబులు పట్టుకుందని, ఓర్చుకోలేకపోతున్నారని ఆరోపించారు. గవర్నర్ ప్రసంగాన్ని ప్రజలకు చేరకుండా బీఆర్ఎస్ నేతలు కుట్రకు తెర లేపారని ఫైర్ అయ్యారు. పదేళ్లు అధికారంలోని ఉండి.. రైతులకు ఏమి చేయని కేటీఆర్ (KTR) నేడు వారిపై మొసలి కన్నీరు కారుస్తుండటం విడ్డూరంగా ఉందని విప్ ఆది శ్రీనివాస్ అన్నారు.