బ్రేకింగ్: ట్యాంక్ బండ్‌లో దూకి యువతి ఆత్మహత్యయత్నం

by Satheesh |
బ్రేకింగ్: ట్యాంక్ బండ్‌లో దూకి యువతి ఆత్మహత్యయత్నం
X

దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్‌లోని ట్యాంక్ బండ్‌లో దూకి ఓ యువతి ఆత్మహత్యయత్నానికి పాల్పడటం కలకలం రేపింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మెదక్ జిల్లాకు చెందిన ఓ యువతి ఆదివారం ట్యాంక్ బండ్‌లో దూకి ఆత్మహత్యయత్నానికి పాల్పడింది. ఇది గమనించిన లేక్ పోలీసులు సకాలంలో స్పందించారు. వెంటనే ట్యాంక్ బండ్‌లోకి దూకి ఆ యువతిని ప్రాణాలతో రక్షించారు. ప్రేమ పేరుతో ఓ యువకుడు మోసం చేయడంతో మనస్థాపం చెంది ఆత్మహత్యయత్నం చేసినట్లు యువతి పోలీసులకు తెలిపింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు రాజశేఖర్ అనే యువకుడిపై కేసు నమోదు చేసిన పోలీసులు.. అరెస్ట్ చేసినట్లు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

Next Story