చంద్రశేఖర్ రావు కాదు.. ఉత్త కూతల ఉత్తమరావు

by Javid Pasha |
చంద్రశేఖర్ రావు కాదు.. ఉత్త కూతల ఉత్తమరావు
X

దిశ, వెబ్ డెస్క్: సీఎం కేసీఆర్ చెప్పేవన్నీ అబద్దాలేనంటూ ఓ యువతి వినూత్నంగా నిరసన వ్యక్తం చేసింది. ఓ ప్లేట్ లో చికెన్, మటన్ , ఫిష్ , ప్రాన్స్, మిరపకాయ బజ్జీలు, సకినాలు, బాదుషాతో కూడిన భోజనం.. మరో ప్లేట్ లో తెల్ల అన్నం.. గొడ్డుకారంతో భోజనం పట్టుకొని కేసీఆర్ హామీలపై డెమో ఇచ్చింది. ఎన్నికల సమయంలో కేసీఆర్ ఇచ్చే హామీలన్నీ చికెన్, మటన్ , ఫిష్ , ప్రాన్స్, మిరపకాయ బజ్జీలు, సకినాలు, బాదుషాతో కూడిన భోజనంలా ఉంటాయని, కానీ ఎన్నికల తర్వాత చేసేది మాత్రం వట్టి తెల్లన్నం లాగే ఉంటుందని ఆరోపణలు గుప్పించింది.

కేసీఆర్ ఇలా ఏ పథకం తీసుకున్నా ఇలాగే ఉంటుందని తెలిపింది. దళిత బంధు, దళితులకు మూడెకరాల భూమి, డబుల్ బెడ్రూం ఇండ్లు.. ఇలా కేసీఆర్ ఎన్నో హామీలిచ్చారని కానీ ఏ ఒక్కటీ నెరవేర్చలేదని మండిపడ్డారు. హామీలను తుంగలో తొక్కడంలో.. అబద్దాలు చెప్పడంలో కేసీఆర్ కు ఎవరూ సాటిరారని ఎద్దేవా చేసింది. ఈ నేపథ్యంలోనే ఆ యువతి కేసీఆర్ కు ‘‘ఉత్త కూతల ఉత్తమరావు’’ అని నామకరణం చేసింది. కేసీఆర్ ను నమ్మితే మరోసారి మోసపోవడం ఖాయమని ఆ యువతి తెలిపింది.

Advertisement

Next Story

Most Viewed