- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
వేధిస్తున్నాడని వ్యక్తిని చంపిన యువతి
దిశ, ఏటూరునాగారం: ఓ వ్యక్తిని యువతి దారుణ హత్య చేసిన ఘటన ఏటూరునాగారం మండల కేంద్రంలో చోటు చేసుకుంది. ఏటూరునాగారం ఏస్సై రమేష్ తెలిపిన వివరాల ప్రకారం.. మండల కేంద్రంలోని 3వ వార్డుకు చెందిన జాడి శ్రీను(32), జాడీ సంగీత(30) చిన్న తనం నుండి మిత్రులు. కాగా కొంత కాలంగా శ్రీను, సంగీతను వేధిస్తుండడంతో సంగీత స్థానిక పోలీసు స్టేషన్‌లో కేసు పెట్టింది. దీంతో శ్రీను ఇటీవల జైలుకు వెళ్లి వచ్చాడు. జైలు నుండి వచ్చిన శ్రీను పద్ధతి మార్చుకోకుండా మరల వేదింపులకు దిగాడు.
ఈ క్రమంలోనే బుదవారం రాత్రి 9 గంటల సమయంలో శ్రీను సంగీత ఇంటికి వెళ్లి తలుపు తీయాలని బలవంతం చేశాడు. ఏంత సేపటికి తలుపు తీయకపోయే సరికి అక్కడి నుండి వెళ్లిపోయిన శ్రీను తిరిగి రాత్రి ఒంటిగంట సమయంలో సంగీత ఇంటి వద్దకు వచ్చి తలుపు తీయాలని బలవంతం చేశాడు. కాసేపటికి తలుపు తీసిన సంగీత ముందుగా వేసుకున్న పథకం ప్రకారం శ్రీనును ఇంటిలోకి రాగానే అక్కడ ఉన్న దోమతెర, ఒక వైరుతో కట్టి ఇంటి ముందర ఉన్న షెడ్డు పోల్‌కు బంధించింది. అనంతరం కత్తితో పలుమార్లు శ్రీనును పోడిచి హత్య చేసింది. అనంతరం సంగీత నేరుగా పోలీసు స్టేషన్‌కు వెళ్లి లోంగిపోయింది. ఈ క్రమంలో హత్యకు వాడిన కత్తిని క్రాస్ రోడ్ వద్ద పాత బస్ డిపో వద్ద పాడేసింది. కాగా విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.