- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ట్సాన్స్‌జెండర్‌ను పెళ్లి చేసుకున్న యువకుడు.. పేరెంట్స్ రియాక్షన్ ఇదే!
దిశ, డైనమిక్ బ్యూరో: ప్రేమకు జండర్‌తో సంబంధం లేదని మరోసారి ఓ యవజంట రుజువుచేసింది. ఏపీ ఎన్టీఆర్ జిల్లా నందిగామకు చెందిన ఓ ట్రాన్స్ జెండర్‌ను తెలంగాణ యువకుడు పెళ్లి చేసుకున్న ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. డీవీఆర్ కాలనీకి చెందిన పసుపులేటి దీపు (ట్రాన్స్ జెండర్)ను ఖమ్మం జిల్లాకు చెందిన లావూరి గణేష్ ప్రేమించాడు. హైదరాబాద్‌లో వీరికి పరిచయమైంది, ఏడాది నుంచి వీరు ప్రేమించుకుంటున్నారు.
ఇద్దరు కలిసి అక్టోబర్ 29న నందిగామ ప్రాంతంలోని ఓ ఆంజనేయ స్వామి ఆలయంలో వివాహం చేసుకున్నట్లు వారు తెలిపారు. దీంతో విషయం తెలుసుకున్న గణేష్ కుటుంబ సభ్యులు ఆదివారం నందిగామ పీఎస్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో గణేష్, దీపును పోలీసులు పిలిపించారు. తనకు దీపు అంటే ఇష్టమని, తనతోనే ఉండిపోతానని గణేష్ కుటుంబ సభ్యులకు తేల్చి చెప్పడంతో వారు వెళ్లిపోయారు. పోలీసుల సమక్షంలో వారిద్దరు ఒక్కటైయ్యారు. వీరిద్దరూ మాట్లాడిన వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన నెటిజన్లు లవ్‌కి జండర్‌తో సంబంధం లేదని కామెంట్ చేశారు.