- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Hyderabad Loco Pilot : రియాద్‌లో తొలి మెట్రో రైలు నడపనున్న హైదరాబాద్ మహిళ
దిశ, వెబ్ డెస్క్ : హైదరాబాద్(Hyderabad)కు చెందిన లోకో పైలట్(Loco Pilot) ఇందిరా ఈగలపాటి.. సౌది అరేబియా రాజధాని రియాద్(Riyadh)లో త్వరలో ప్రారంభం కానున్న మెట్రో రైళ్లను నడపనున్నారు. రియాద్ మెట్రో రైలు ప్రాజెక్టు(Riyadh Metro Rail Project)లో భాగంగా మొట్టమొదటి ర్యాపిడ్ ట్రాన్సిట్ సిస్టమ్‌ను 2025 జనవరిలో ప్రారంభించేందుకు అక్కడి ప్రభుత్వం సిద్ధమైంది. ప్రపంచంలోనే అత్యుత్తమ మెట్రో రైలు వ్యవస్థల్లో ఒకటిగా ఈ ప్రాజెక్టును రూపొందిస్తున్నట్లు సౌదీ ప్రభుత్వం చెబుతోంది. లోకో పైలట్ ఇందిరా ఈగలపాటి.. హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్టులో పనిచేశారు. మెట్రో రైళ్లను నడపడం, స్టేషన్ల ఆపరేటింగ్‌లో ఆమెకు విశేష అనుభవం ఉంది. ఇందిర నైపుణ్యాలను గుర్తించి రియాద్ మెట్రో ప్రాజెక్ట్ కోసం ఆమెను ఎంపిక చేశారు. భారత్ నుంచి ఆమెతో పాటు మరో ఇద్దరు ఈ ప్రాజెక్టు కోసం ఎంపికయ్యారు. రియాద్ మెట్రో ప్రాజెక్టు కోసం ఐదేళ్లుగా ఇందిర.. అక్కడ ఐదేళ్లుగా శిక్షణ పొందారు.