ఘోర ప్రమాదం.. ఏడాది పాప మృతి

by GSrikanth |
ఘోర ప్రమాదం.. ఏడాది పాప మృతి
X

దిశ, ఏటూరునాగారం: ములుగు జిల్లా తాడ్వాయి మండల పరిధిలో ఘోర ప్రమాదం జరిగింది. ద్విచక్ర వాహనంపై వెళుతున్న తండ్రి రమేశ్, కూతురు జెస్మిక(ఏడాది పాప)వెళుతున్నారు. ఈ క్రమంలో వెనకనుండి స్కూల్ బస్సు ఢీకొట్టింది. ఈ ఘటనలో పాప అక్కడికక్కడే దుర్మరణం చెందగా.. తండ్రికి తీవ్రంగా గాయాలయ్యాయి. రమేశ్‌ది తాడ్వాయి మండలం నార్లపూర్ గ్రామమని సమాచారం. విషయం తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసుకున్నారు. తీవ్ర గాయాలైన రమేశ్‌ను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.

Advertisement

Next Story