- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
ప్రగతిభవన్ వద్ద ఉద్రిక్తత.. సొమ్మసిల్లి పడిపోయిన ABVP నేతలు
by GSrikanth |

X
దిశ, డైనమిక్ బ్యూరో: ప్రగతిభవన్ వద్ద ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ వ్యవహారంపై మంగళవారం ఏబీవీపీ నేతలు ప్రగతిభవన్ ముట్టడికి యత్నించారు. పేపర్ లీక్‌పై సీబీఐతో విచారణ చేయించాలని వారు డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ పరిస్థితుల నేపథ్యంలో ఏబీవీపీ కార్యకర్తలను అడ్డుకునేందుకు పోలీసులు యత్నించగా.. కార్యకర్తలు, పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. తోపులాటలో పలువురు ఏబీవీపీ నేతలు సొమ్మసిల్లి పడిపోయారు. అనంతరం ఏబీవీపీ కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేసి స్టేషన్‌కు తరలించారు.
Next Story