- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
వైఎస్సార్ విగ్రహం ధ్వంసం
దిశ, మహబూబాబాద్ ప్రతినిధి: మహబూబాబాద్ జిల్లా పెద్ద వంగర మండలం లోని అవతాపురం గ్రామంలో మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ నేత వైయస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహాన్ని బుధవారం కొంతమంది దుండగులు ధ్వంసం చేశారు. జేసీబీతోనే కూల్చివేయడం సాధ్యమని పలువురు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కాగా గత నెల 16 వతేదీన వైఎస్సార్ టీపీ చీఫ్ వైఎస్ షర్మిల పాదయాత్ర 3800 మైలురాయి పూర్తి చేసుకున్న సందర్భంగా ఆమె ఈ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ముందుగా ఈ గ్రామంలో వైఎస్సార్ టీపీ జెండా కట్టాలని స్థానిక క్యాడర్ భావించినప్పటికీ అది కాస్తా విగ్రహం నిర్మాణం వరకు దారి తీసింది. అప్పటికే షర్మిల పాదయాత్రలో ఉద్రిక్తత నెలకొంది. ఈ ఉద్రిక్తతల నడుమ ఆమె విగ్రహాన్ని ఆవిష్కరించారు. పాదయాత్ర సందర్భంగా స్థానిక మంత్రి ఎర్రబెల్లి దయాకరరావుపై ఆమె ఘాటుగా వ్యాఖ్యానించారు.
అప్పటి నుండి పాలకుర్తి నియోజకవర్గంలో రాజకీయం హీట్ ఎక్కింది. షర్మిల చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. ఇలాంటి నేపథ్యంలో వైఎస్సార్ విగ్రహాన్ని గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేయడంతో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇది ఇలా ఉండగా ఈ విగ్రహ నిర్మాణానికి ఎలాంటి అనుమతులు తీసుకోలేదని గ్రామ సర్పంచ్ పోలీసులు ఫిర్యాదు చేయగా పోలీసులు విగ్రహాన్ని కట్టిన ఇద్దరు వ్యక్తులు, ఒ క వైఎస్సార్ టీపీ నాయకుడి పై కేసు నమోదు చేసినట్లు ఎస్సై రియాజ్ పాషా తెలిపారు.