- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బ్యారేజీల పరిశీలనకు రాష్ట్ర స్థాయి బృందం
దిశ, డైనమిక్ బ్యూరో: కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల భవిష్యత్ పై ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. ఈ బ్యారేజీలు సమస్యలు ఎదుర్కొంటున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం వీటి పునరుద్ధరణకు చర్యలు చేపడుతోంది. ఈ మేరకు ఇవాళ రాష్ట్ర స్థాయి డ్యామ్ సేఫ్టీ ఆధ్వర్యంలో సెంట్రల్ సాయిల్ అండ్ రీసెర్చ్ స్టేషన్ బృందం మరియు ఇతర సభ్యులతో కూడిన ఓ బృందం బ్యారేజీలను పరిశీలించేందుకు వెళ్లింది. అన్నారంలో 49వ వెంట్ వద్ద మొదలైన లీకేజ్ ను ఈ బృందం పరిశీలించనున్నది. రాష్ట్రస్థాయి బృందం బ్యారేజ్ లపై పూర్తిస్థాయి నివేదిక రూపొందించి నేషనల్ డాం సేఫ్టీ అథారిటీకి రిపోర్ట్ చేయనున్నది. ఈ రిపోర్ట్ ఆధారంగా నేషనల్ డాం సేఫ్టీ అథారిటీ బ్యారేజ్ లు విజిట్ చేసి పలు సూచనలు చేయనున్నది.ఈ మేరకు ఈ వారం లోనే బ్యారేజీలను మరోసారి పరిశీలించడానికి ఎన్డీఎస్ఏ టీమ్ రాష్ట్రంలో పర్యటించే అవకాశం ఉందని తెలిసింది. కాళేశ్వరం ప్రాజెక్టులలోని డ్యామ్ ల డామేజ్ కి కారణాలను తెలపాలంటూ ఈనెల 13న రాష్ట్ర ఇరిగేషన్ సెక్రెటరీ రాహుల్ బొజ్జ ఎన్డీఎస్సీకి లేఖ రాశారు. డ్యామ్ స్థితిపై పూర్తిస్థాయి నివేదిక కావాలని ఎన్డీఎస్ఏను రాష్ట్ర ప్రభుత్వం కోరింది.