Bonalu Festival:తెలంగాణలో బోనాల సందడి..ఈ బోనాల ఉత్సవంలో వారికి ప్రత్యేక స్థానం..?

by Jakkula Mamatha |   ( Updated:2024-07-22 11:05:06.0  )
Bonalu Festival:తెలంగాణలో బోనాల సందడి..ఈ బోనాల ఉత్సవంలో వారికి ప్రత్యేక స్థానం..?
X

దిశ,వెబ్‌డెస్క్:తెలంగాణలో ప్రతి ఏటా అషాఢమాసంలో జరిగే బోనాల ఉత్సవాలకు ఎంతో ప్రత్యేకత ఉంది. ఈ ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుపుకుంటారు. బోనాల జాతరకు పెద్ద ఎత్తున ప్రజానీకం హాజరవుతారు. ఈ ఉత్సవాలను హైదరాబాద్, సికింద్రాబాద్, చుట్టుపక్కల ప్రాంతాల్లో నెల రోజుల పాటు ఘనంగా నిర్వహిస్తుంటారు. నేడు సికింద్రాబాద్ మహంకాళి బోనాలు వైభవోపేతంగా ముగిశాయి. అయితే రాష్ట్ర పండుగుగా గుర్తింపు పొందిన ఈ బోనాల పండుగ తెలంగాణలో జులై నెలలో అంగరంగ వైభంగా జరుపుకుంటున్నారు. అయితే ఈ బోనాల పండుగకు ఎంతో ప్రత్యేకతను సంతరించుకుంది. అందులో ముఖ్యంగా బోనాల ఉత్సవాల్లో జోగినీలది ప్రత్యేక స్థానంగా చెబుతారు.

బోనాల పండుగ ఎలా వచ్చిందంటే..

బోనాల పండుగ తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా జరుపుకుంటారు. ఈ ఉత్సవాలు మొదటగా 1813లో హైదరబాద్‌లో ప్లేగు, కలరా వ్యాధుల నుంచి ప్రజలను కాపాడడానికి ఆరాధనగా మొదలైందని చెబుతారు. మహంకాళి అమ్మవారిని పూజించడం ద్వారా ప్లేగు మహమ్మారి నుంచి విముక్తి కలిగిందని ప్రజలు ఆనాటి కాలం నుంచి విశ్వసిస్తున్నారు. దీంతో బోనాల పండుగ జరుపుకుంటారని తెలుస్తోంది.

బోనాల పండుగలో జోగినీలదే ప్రత్యేక స్థానం..

రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా నిర్వహించే బోనాల వేడుకల్లో జోగినీలు ప్రధాన పాత్ర పోషిస్తారు. దేవతలకు తమ జీవితాన్ని అంకితం చేసిన స్త్రీలను జోగినీలు అంటారు. జోగినులను శివ శక్తులుగా కూడా చెబుతారు. వీరు అమ్మవారిని నిత్యం ఆరాధిస్తారు. బోనాల జాతర సందర్భంగా గ్రామ దేవతలైన పోచమ్మ, ఎల్లమ్మ, మైసమ్మ, బాలమ్మ, ముత్యాలమ్మ, మహంకాళమ్మ, పెద్దమ్మకు పసుపు కుంకుమలు, చీర సారెలు, భోజన నైవేద్యాలతో ప్రత్యేక పూజలు చేస్తారు. వాస్తవానికి అచ్చమైన తెలుగుతనం ఉట్టిపడేలా ఈ బోనాల పండుగ జరుపుతారు. బోనాల సమయంలో జోగినీలు సామాజిక సేవా కార్యక్రమాల్లో కూడా పాల్గొంటారు. బోనాల పండుగలో వీరు పాటించే ఆచారాలు, సాంస్కృతికత ఆధునిక సమాజంలో మార్పును తీసుకు వస్తుందని ప్రజలు భావిస్తారు.

Advertisement

Next Story