గాడిదలు కాయాలని పోలీసులకు సూచించిన షర్మిల.. ‘ఓకే మేడం’ అంటూ షాకింగ్ రిప్లై

by Javid Pasha |   ( Updated:2023-04-24 10:56:14.0  )
గాడిదలు కాయాలని పోలీసులకు సూచించిన షర్మిల.. ‘ఓకే మేడం’ అంటూ షాకింగ్ రిప్లై
X

దిశ, వెబ్‌డెస్క్: పోలీసులపై వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సోమవారం ఉదయం షర్మిల ప్రగతిభవన్‌కు బయలుదేరారన్న సమాచారంతో ఆమె ఇంటివద్ద పోలీసులు భారీగా మోహరించారు. షర్మిల బయటకు రాగానే అదుపులోకి తీసుకునేందుకు యత్నించారు. దీంతో ఆగ్రహంతో ఊగిపోయిన షర్మిల ఇద్దరు పోలీసులపై దాడి చేశారు. దాడిని తీవ్రంగా పరిగణించిన పోలీసులు ఆమెపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. ఈ క్రమంలో ఆమె అక్కడే బైఠాయించి పోలీసుల తీరుపై మండిపడ్డారు.

‘మీకు ఏం పనిలేకపోతే గాడిదలు కాసుకోండి పోయి’ అని షర్మిల ఆగ్రహం వ్యక్తం చేయగా.. ‘అదే పనిచేస్తున్నాం మేడం’ అంటూ ఆ పోలీస్ ఆఫీసర్ రిప్లై ఇవ్వడం సంచలనంగా మారింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. నీ టైమింగ్‌కు హ్యాట్సాఫ్ సార్ అంటూ పోలీస్ ఆఫీసర్‌ను నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు.

Also Read..

వీళ్లు లేడీలా.. రౌడీలా..? షర్మిల, విజయమ్మలపై నెటిజన్లు ఫైర్

పోలీసులపై చేయి చేసుకున్న YS షర్మిల.. కేసు నమోదు (వీడియో)

Advertisement

Next Story