- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఉమ్మడి వరంగల్ జిల్లాలో కేటీఆర్ కు సొంత పార్టీ శ్రేణుల షాక్!
దిశ, డైనమిక్ బ్యూరో: ఉమ్మడి వరంగల్ జిల్లాలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు సోంత పార్టీ శ్రేణులే షాక్ ఇచ్చారు. ఆయన మాట్లాడుతుండగానే బీఆర్ఎస్ కేడర్ కూర్చీలు ఖాళీ చేసి వెళ్లిపోతున్న వీడియోలు నెట్టింట వైరల్ గా మారాయి. పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా మంగళవారం సాయంత్రం ఉర్సు నాని గార్డెన్స్ లో వరంగల్ తూర్పు నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి కేటీఆర్ సహా ఉమ్మడి వరంగల్ జిల్లా ముఖ్యనాయకులు, కార్యకర్తలు హాజరయ్యారు.
అయితే ఈ సమావేశంలో కేటీఆర్ మాట్లాడుతుండగానే బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు సభాప్రాంగణం విడిచి వెళ్లిపోతున్నారు. ఆయన ప్రసంగం పూర్తి కాకుండానే కేడర్ కుర్చీలు ఖాళీ చేసి వెళ్లిపోయారు. అయినా సరే కేటీఆర్ తన ప్రసంగాన్ని చివరి వరకు కొనసాగించారు. దీనికి సంబందించిన వీడియోలు నెట్టింట వైరల్ గా మారడంతో కేటీఆర్ తీవ్ర అసంతృప్తికి లోనై పార్టీ నేతలపై మండిపడ్డట్టు తెలుస్తోంది. అయితే బీఆర్ఎస్ ముఖ్యనేత మాట్లాడుతుండగానే సొంత పార్టీ కేడర్ వెళ్లిపోతుండటం పార్టీ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశం అయ్యింది.
బీఆర్ఎస్ పార్టీలో అభ్యర్ధి తప్పుకోవడంతో కొత్త అభ్యర్ధిని బరిలో దించడం వల్ల కేడర్ లో అసంతృప్తి పెరిగిందా? లేక పోటీ నుంచి తప్పుకున్న నేత చెప్పినట్లుగానే బీఆర్ఎస్ పై ఉన్న వ్యతిరేఖతే కారణమా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. కాగా ముందుగా బీఆర్ఎస్ నుంచి వరంగల్ పార్లమెంట్ అభ్యర్ధిగా కడియం శ్రీహరి కూమార్తె కడియం కావ్యను ప్రకటించారు. ఆమె బీఆర్ఎస్ నేతలు అంతర్గత కుమ్ములాటలతో ఎవరికి వారు సొంత గ్రూపులు ఏర్పాటు చేసుకొని, అభ్యర్ధికి సహకరించట్లేదని, నేతలపై కేసుల వల్ల ప్రజల్లో తీవ్ర వ్యతిరేఖత ఉండటంతో వరంగల్ లో పార్టీ గెలిచే పరిస్థితి లేదని పోటీ నుండి తప్పుకున్నారు. అనంతరం కాంగ్రెస్ పార్టీలో చేరి టికెట్ తీసుకొని వరంగల్ పార్లమెంట్ బరిలో ఉన్నారు.