- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
TS: ప్రభుత్వ ఆసుపత్రిలో చేరిన అధికార పార్టీ ఎమ్మెల్యే
by GSrikanth |
X
దిశ, వెబ్‌డెస్క్: ఖానాపూర్ అధికార కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. తీవ్ర టైఫాయిడ్ జ్వరంతో బాధపడుతున్న ఆయన మంగళవారం రాత్రి జిల్లాలోని ఉట్నూర్ ప్రభుత్వ ఆసుపత్రిలో చేరారు. జ్వరం అధికంగా ఉండటంతో నాలుగైదు రోజుల పాటు విశ్రాంతి తీసుకోవాలని డాక్టర్లు సూచించారు. ప్రభుత్వ ఆసుపత్రులపై ప్రజల్లో నమ్మకం పోతున్న ఈ తరుణంలో స్వయంగా ఎమ్మెల్యే సర్కార్ ఆసుపత్రిలో చికిత్స పొందడం ఆదర్శనీయమని స్థానికుల్లో చర్చ జరుగుతోంది.
గొప్పలకు పోకుండా ప్రజాప్రతినిధులంతా ఇలా చేస్తే అందరికీ మెరుగైన వైద్యం అందించడానికి అవకాశం ఉంటుందని అభిప్రాయపడుతున్నారు. చిన్నతనంలో పేపర్ బాయ్ పనిచేసిన ఈ ఎమ్మెల్యే.. ఇటీవల ఎమ్మెల్యే జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి, మాజీ మంత్రి కేటీఆర్ మిత్రుడైన జాన్సన్ నాయక్ భూక్యాపై బొజ్జు ఘన విజయం సాధించారు.
Advertisement
Next Story